
| నామం | అంతరార్థము |
|---|---|
|
భూశయః భూషణః భూతిః |
పుట్టినవన్నీ అందులోనే ఉన్నాయి (శయ) అందులోనే (సన) ఫలిస్తున్నాయి. (భూతి) అదే అయి ఉన్నాయి. ఈ రూపాలలో కనిపిస్తున్నదదే. |
|
విశోకః శోకనాశనః |
అంచేత దానికీ శోకం లేదు. తద్రూపమే అయిన ఈ భూత జాతానికీ లేదు. తత్సాంగత్యం వల్ల నశింపజేస్తుంది. |
|
అర్చిష్మాన్ అర్చితః కుంభః |
చిద్దీప్తి గలదది. కనుక చిద్వృత్తి చేతనే అర్చించవలసినది. చిత్తునే తనలో కుంభించినది. అదే మనలోనూ కుంభింప చేయగలిగినది. |
|
విశుద్ధాత్మా విశోధనః |
తత్పదార్థంగా అది ఎప్పుడూ శుద్ధమైనది. త్వంపదార్థమైన మనలనూ శుద్ధి చేయగలదు. |
|
అనిరుద్ధః అప్రతిరథః ప్రద్యుమ్నః అమితవిక్రమః |
సజాతీయం చేత నిరుద్ధం కాదది. విజాతీయం చేతా కానిదే. ద్యుమ్నమంటే దీప్తి. ప్రకృష్టమైన చైతన్య దీప్తి అది. వి అంటే ఆకాశం., అనంతమైన ఆకాశాన్ని తనదీప్తితో ఆక్రమించినది. అదే చిదాకాశం. |
|
కాలనేమినిహా వీరః |
కాలమనే చక్రాన్ని విరిచి పారవేసింది. వి+ఈర - ఈరణం అంటే చలనం, ఏ మాత్రమూ లేనిది. చలనమే గదా కాలం. దాన్ని నిర్మూలించిందంటే అచలమే అది. |
|
శౌరిః శూరజనేశ్వరః |
జ్ఞానశూరుడైన పరమాత్మే శౌరి. అలాంటి శూరులైన జ్ఞాను లందరికీ ఈశ్వర - నాయకుడాయన. |
|
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః |
నిర్గుణమే సగుణమయి త్రిలోకాలకూ (ఆత్మ) స్వరూప మయింది. వాటికి నియామకమయింది. క+అ+ఈశ - బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలలో కనిపిస్తున్నది. కేశ-కిరణాలుగా |
Page 48
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు