#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
శ్రీనిధిః
శ్రీవిభావనః
చూపగలవాడు. విశేషంగా భావన చేసే కొద్దీ వాటిని మనకు ప్రసాదిస్తాడు.
శ్రీధరః
శ్రీకరః
శ్రేయః
సర్వశక్తులూ నిత్యమూ ధరించినవాడూ, మనలను ధరింపజేయ గలవాడూ అందుకోస మాశ్రయించవలసిన వాడూ ఆశ్రయిస్తే శ్రేయోదాయకుడైనవాడూ ఆ పరమాత్మ.
శ్రీమాన్
లోకత్రయా
శ్రయః
శ్రీమంతుడూ ఆయనే. శ్రీ వివర్తమైన లోకత్రయానికీ అధిష్ఠాన మైన వాడూ మరలా ఆయనే. ఆరోపితమూ అధిష్ఠానమూ రెండూ పరమాత్మేనని భావం.
స్వక్షః
స్వంగః
శతానందః
నందీ
సు+అక్ష-సకలేంద్రియ సౌష్ఠవమూ చైతన్య ప్రభావమే. సర్వావయవ (సు+అంగ) సౌష్ఠవమూ దాని ప్రభావమే. శతవిధాల మనసుకు కలిగే ఆనందమూ తత్ప్రభావమే. కాగా దానిననుభవించి ఆనందించే జీవతత్త్వమూ అదే.
జ్యోతిర్గణేశ్వరః ప్రకాశశీలమైన ఇంద్రియ వర్గానికీ ఆధిదైవికమైన జ్యోతిర్గణానికీ కూడా ప్రకాశకుడైనవాడు పరమాత్మ.
విజితాత్మా
విధేయాత్మా
దేనిచేతా పరాజితం కాకుండా అన్నిటినీ తనకు విధేయం చేసుకొని పాలించే సచ్చిత్స్వరూపుడాయన.
సత్మీర్తి
ఛిన్న సంశయః
సద్రూపమైన ప్రకాశమది. అందుకే దాని నాశ్రయిస్తే ఎలాంటి సంశయాలైనా విచ్ఛిన్నం కావలసిందే జీవులకు.
ఉదీర్ణః
సర్వతశ్చక్షుః
అనీశః
శాశ్వతస్థిరః
సంశయస్థానమైన సంసారాన్ని మించి (ఉత్-ఈర్ణ) పైకి లేచిన దాతత్త్వం. అంటకుండా అన్నివైపులా చూస్తున్నదీ సంసారాన్ని, దాన్ని చూచే సామర్థ్యం దేనికీ లేదు. అది ఎప్పటికీ నిలిచి ఉండేదా చూపు.

Page 47

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు