#


Index

ధాతా పురస్తాద్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశ శ్చతస్రః తమేవ విద్వా నమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే

  వసిష్ఠాది మహర్షులే గాక ఇలాగే ఇంద్రాది దేవతలు కూడా పూర్వమిదే అనుభవాన్ని లోకాని కావిష్కరించి చెప్పారు. ద్విర్బద్ధం సుబద్ధం భవతి అన్నారు. రెండు మూడు మార్లు అవీ ఇవీ పెట్టి గట్టిగా పాతితే ఇక కదలకుండా ఉంటుందా స్తంభం. అలాగే ఋషుల మీద దేవతల మీద పెట్టి చెబితే మానవులు కూడా అదే మార్గంలో అసలైన పరమార్ధాన్ని గట్టిగా పట్టుకొని స్వానుభవానికి తెచ్చుకోవాలని శాస్త్ర వివక్షితం.

  అయితే ఎవరా దేవతలు ఎలా తెచ్చుకొన్నా రనుభవానికని ప్రశ్న వస్తే చెబుతున్నారు. ధాతా పురస్తా ద్యము దాజహార బ్రహ్మ దేవుడు మొదటి గురువు బ్రహ్మవేత్తలందరికీ. ఆయన గారు బోధ చేశారు మొదట దేవేంద్రుడికి. శక్రుడంటే దేవేంద్రుడే. శక్నో తీతి శక్రః గ్రహణ శక్తి ఉన్నవాడెవడో వాడు శక్రుడని లక్షణార్థం. అలాటి పాత్రుడైన వాడికి విద్యాదానం చేస్తే అది సత్ఫలిత మిస్తుంది. ఎలా ఫలించిం దాయనకది. శక్రః ప్రవిద్వాన్ ప్రదిశ శ్చతస్రః - నలుదిక్కులూ వ్యాపించి

Page 95