రూపాలనన్నింటినీ వెదకి వెదకి పట్టుకొని ఇది ఫలానా అది ఫలానా అని చూస్తూ కూచున్నాడట.
ఏమిటర్థం. చెప్పాము గదా. నామమే ముందు. రూపమే తరువాత
అని నామమంటే ప్రజాపతి మనసులో ఉదయించిన సంకల్పం.
ఆలోచన. అనాహతమది Inarticulate నోట ఉచ్చరిస్తే శబ్దమవుతుందది.
Articulate. అదే సూక్ష్మావస్థ నుంచి అంతకంతకు స్థూలమైన దశకు
దిగి వచ్చి వ్యక్తమైన జగత్తుగా పరిణమిస్తే అది రూపం. ఇవే శబ్దార్థాలు.
లేదా ప్రత్యయ Idea విషయాలు Thing. వీటి రెండింటి పరస్పర
సంవ్యవహారమే Transaction క్రియ. నామరూప క్రియలే మొత్తం
సంసారం. ఇది నిరుపాధికమైన ఆ పురుషుడి ఉపాధి. అవి స్వరూపమైతే
ఇది ఆయన విభూతి విస్తారం. కాని ఇది ఆ పరమాత్మ తాలూకు
విభూతి అని చూడటం లేదు మనబోటి మానవులం. దాని నుంచి
దీన్ని విడగొట్టి కేవలమిది సంసార మనే భావనతో చూస్తున్నాము.
కనుకనే బంధకమయి కూచుంది మనకిది. పోతే అలా విడగొట్టి కాదు.
దీన్ని దాని కొక ఆలంబనగా చేసుకొని దీని ద్వారా దాన్ని దర్శించండని
మనకు మహర్షి చేసే బోధ ఇది. కనుకనే వేదాహం పురుషం
పురుష సృష్టిని గాక సృష్టి ద్వారా స్రష్ట అయిన పురుష తత్త్వాన్ని
దర్శిస్తున్నాము మేము మీరూ అలాగే దర్శించండని మనకు
భంగ్యంతరంగా సలహా ఇస్తున్నాడు.
Page 94