ఒక బ్రహ్మవేత్త అయిన మహర్షి తన అనుభవాన్ని ఇలా బయట పెడుతున్నాడు. అవధరించండి. వేదాహం. నేను బాగా ఎరుగుదును. వేద అంటే ఎఱుగుదుననే గాదు. అసలా శబ్దాని కర్ధం దర్శించటమని. ఇది ఇంతకు పూర్వమే అక్కడక్కడ పేర్కొని ఉన్నాను. తెలియట మనేది పరోక్షమైనా కావచ్చు కాని దర్శన మన్నప్పుడది పరోక్షం కాదు. ప్రత్యక్షం. అనుభవమెప్పుడూ ప్రత్యక్షమే గదా. కనుక వేదాహ మంటున్నాడంటే అనుభవించి మాటాడుతున్నాడాయన. దేని ననుభవించాడు. పురుషం మహాంతం. అణోరణీయాన్ మహతో మహీయానని పరావరాలను రెండింటినీ సమానంగా వ్యాపించిన ఆ పురుషుణ్ణి. పూర్ణమైన తత్త్వమే గదా పురుషుడంటే. పూర్ణమెప్పు డవుతుంది. దేశకాలాదులన్నీ వ్యాపిస్తే.
ఎలా ఉంటుందది. ఆదిత్య వర్ణం తమసస్తుపారే. పెంజీకటి కవ్వల అన్నట్టు ఈ తమస్సును దాటి ఉన్న తేజో మండలమది. తమస్సంటే ఇక్కడ అజ్ఞానం. తేజస్సంటే జ్ఞానం. అజ్ఞానం లేశ మాత్రం కూడా సోకని కేవల జ్ఞాన స్వరూపమది. ప్రజ్ఞానం. Pure Perfect consciouness ఇది పరమాత్మ స్వరూపమైతే Substance ఇక ఆయన విభూతి Formation or Expansion వర్ణిస్తున్నాడు. ఏమని. సర్వాణి రూపాణి విచిత్య నామాని కృత్వా. నామాలు మొదట తయారు చేసుకొని వాటితో
Page 93