#


Index

  మన శరీరాలూ అవయవాలూ వ్యష్టి రూపంగా పరిమితమైతే - సమష్టి రూపంగా అవి ఆ పురుషుడికి పరిపూర్ణంగా ఉంటాయని భావన. పరిపూర్ణమైన తత్త్వమే పరిమితంగా కూడా భాసిస్తున్నదే గాని పరిమితమంటే దానికన్యంగా వేరొకటేదీ లేదని కూడా ఇందులో మనం గ్రహించవలసిన ఇంకొక రహస్యం.

  అయితే ఇదంతా ఎందుకిలా వర్ణించటం. దీనివల్ల మనకు శాస్త్రం చేస్తున్న ఉపదేశమేమిటి అని ప్రశ్న వచ్చింది. దానికి సమాధాన మేమంటే నిరుపాధికమైన ఆ పురుష స్వరూపమే సోపాధికమైన ఈ దేశకాల వస్తు ప్రపంచంగా భాసిస్తున్నది. కాబట్టి మనమీ ఉపాధులను గాదు పట్టుకోవలసింది. ఇవన్నీ దేనికి చెందిన ఉపాధులో దాని స్వరూపాన్ని ఈ ఉపాధుల ద్వారా అందుకొని దానితో తాదాత్మ్యం చెంది జనన మరణాదికమైన ఈ సంసార బంధాన్ని తప్పించుకొని బయట పడాలని శాస్త్ర హృదయం. అదే ఇప్పుడు క్రమంగా బోధిస్తున్నదీ పురుష సూక్తం మనకు పూర్వులైన మహర్షుల స్వానుభవం ద్వారా.

వేదాహ మేతం పురుషం మహాంత - మాదిత్యవర్ణం తమసస్తు పారే - సర్వాణి రూపాణి విచిత్యధీరో - నామాని కృత్వా 2 భివదన్ యదాస్తే

Page 92