#


Index

  అంటే తేజోజల భూతాలు ప్రాణం వాయువేనంటే ప్రాణం శరీరమంతా వ్యాపించినట్టే విశ్వశరీరమంతా వాయుమండలం వ్యాపించి ఉంది. పోతే ఇక నాభి అంతరిక్షం - శిరస్సు ఆకాశం - పాదాలు భూమి అన్నారంటే భూమి క్రింద ఉంది పాదాలలాగా - నాభి మధ్యలో ఉంది. కాబట్టి అంతరిక్షమే అది. ఆకాశం రెండింటికీ పైన ఉంది. శిరస్సూ అలాగే అన్నిటికీ మీదనే ఉంటుంది. ఇక్కడికి పృథివి అంతరిక్షం ఆకాశం మూడూ కలిసి వచ్చాయి. పృథి వ్యాకాశాలు గాక మిగతా మూడు భూతాలూ కూడా ఇంద్రాగ్ని ప్రాణాలనే మూడు సంకేత శబ్దాల మాటున తొంగి చూస్తూ ఉన్నాయి గనుక మొత్తం మీద పంచభూతాలు కలిసి వచ్చాయి. వీటితో పాటు సూర్య చంద్రులు కూడా కలిసి వచ్చారు. సూర్యచంద్రులు అహోరాత్ర రూపంగా నడిచే కాలానికి సంకేతం. అవి అయిదూ పంచభూతాత్మకమైన ప్రపంచానికి. అంటే మరొక మాటలో చెబితే వస్తు జాతానికి. సూర్యచంద్రులనే ఇవి రెండూ కాలానికి సూచక మవుతున్నాయి. కాగా దేశమనే దొకటి మిగిలి ఉందీ వరుసలో. అది దిశః శ్రోత్రాత్ దిక్కులే ఆయన శ్రోత్రాలనటంలో కలిసి వచ్చింది. అప్పటికి దేశ కాల వస్తువులన్నీ వ్యాపించిన ప్రజాపతి విరాడ్రూపం కండ్లకు కట్టినట్టు దర్శన మిస్తున్నదీ వర్ణనలో. అంతేకాదు. మరొక విశేషమేమంటే మనకేది మనస్సో అది అక్కడ చంద్రుడు. మనకేది శ్రోత్రమో అది అక్కడ సూర్యమండల మని ఇలా వర్ణించం వల్ల

Page 91