#


Index

  ఉన్నదంతా ఆ బ్రహ్మ చైతన్యమే అదే దేశ కాలాది రూపంగా ఇలా పరచుకొని కనిపిస్తున్నదని ప్రవిద్వాన్ చక్కగా గ్రహించ గలిగాదట ఆ దేవేంద్రుడు. బ్రహ్మ దేవుడి లాంటి ఆచార్య పురుషుడు బోధిస్తే శక్రుడి లాంటి సచ్ఛాత్రుడు గ్రహించ లేకపోవట మేమిటి. ఆచార్యవాన్ పురుషో వేద అని వేద వాక్యం. ఆచార్యుడే మార్గదర్శకు డెప్పుడైనా. అందుకే దేశికుడన్నారు. Demonstrator ఆచార్యుణ్ణి. అతడా బ్రహ్మం ఫలానా అని నిర్దేశిస్తే అలాగే దర్శించాడా ఇంద్రుడు.

  తమేవ విద్వాన్. అలాటి బ్రహ్మ స్వరూపాన్నే మనబోటి మానవులమూ గ్రహించగలిగితే మనమూ జ్ఞానులమే. జ్ఞానులం కావటమే కాదు. అమృత ఇహ భవతి. అమృతులం కూడా కాగలము. మృతి లేని వాడెవడో వాడ మృతుడు. అంటే మృత్యుంజయు డయి పరమాత్మలాగా వీడూ ఎప్పటికీ నిలిచి ఉంటాడు. నామరూపాత్మకంగా కాదు. సచ్చిదాత్మకంగా. నామరూపాలు నశించినా సచ్చిదాత్మకమైన తత్త్వం నవించదు. నిరాకారంగదా ఎలా మారుతుంది. మారటమే మరణం. అంచేత బ్రహ్మైవాహ మస్మి సచ్చిదాత్మకమని ఎప్పుడు భావించాడో ఆ భావాని కనుగుణంగా భ్రమర కీట న్యాయాన్ని అనుసరించి బ్రహ్మమే అయిపోతాడీ జ్ఞాని. బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి అని గదా వేద వచనం. కాబట్టి అమృత ఇహభవతి.

Page 96