తయారవుతుందా. అలాగే ఇక్కడా జరిగింది. ఎలాగో వర్ణిస్తున్నది వినండి పురుషసూక్తం.
యత్పురుషేణ హనిషా - దేవా యజ్ఞమ తన్వత వసంతో అస్యాసీ దాజ్యం - గ్రీష్మ ఇధ్మ శ్శర ద్ధవిః సప్తా స్యాసన్ పరిధయ- స్త్రీ స్సప్త సమిధః కృతాః దేవా యద్యజ్ఞం తన్వానా - అబధ్నన్ పురుషం పశుమ్ -
స్వరాట్టయిన ఆ మూల పురుషుడు విరాట్పురుషుడుగా మారాలిప్పుడు. అలా మారాలంటే యత్పురుషేణ హవిషా. హవిస్సయి పోవాలీ మానస యజ్ఞకుండంలో. హవిస్సయి పోవటమంటే ఆహుతి అయి పోవటం, యజ్ఞంలో ఆజ్యాన్ని హోమం చేస్తారు. దానికి హవిస్సని పేరు. ఇది మానసమైన జ్ఞాన యజ్ఞం. భౌతిక యజ్ఞం కాదు. ఒక యజ్ఞం లాగా దీన్ని భావిస్తే ఇందులో హోమమయ్యే పదార్ధ మేమిటని ప్రశ్న వచ్చింది. అది ఏదో గాదీ పురుషుడేనట. దీన్ని హోమం చేసిన వారెవరు. దేవా యజ్ఞమతన్వత. దేవతలే చేస్తున్నారు. కాబట్టి యజ్ఞంగాని ఈ యజ్ఞంలో సాక్షాత్తూ ప్రజాపతే ఆహుతి అయ్యాడు.
అసలెవరీ దేవతలు. దీవ్యంతి ప్రకాశంతే ఇతి దేవాః ప్రకాశించే స్వభావమున్న వారెవరో వారు దేవతలు.
Page 74