#


Index

  ఉపాదానంగా ఇది అవుతూ నిమిత్తంగా దీన్ని దాటి పోతున్నాడు. నిమిత్తో పాదానాలు రెండూ ఒకటే అద్వైతంలో.

  రెండూ ఒకటి గనుకనే పశ్చా ద్భూమి మధో పురః భూమినీ పురములనూ రెండింటినీ వ్యాపించ గలిగాడు. భూమి అంటే సమష్టి శరీరమైన బ్రహ్మాండ Cosmos - Universe - భవతీతి భూః ఏది మొదట ఆ నారాయణ తత్త్వానికి వివర్త రూపంగా ఏర్పడిందో అది. దానినంతా వ్యాపించిందా తత్త్వం. అంతే గాక పురః పురాలను కూడా వ్యాపించింది. పురాలంటే వ్యష్టి శరీరాలు. అవి కొన్ని ద్విపాత్తులు. కొన్ని చతుష్పాత్తులు. చెబుతున్నది బృహ దారణ్యకం. వినండి. పురుశ్చక్రే ద్విపదః - పురశ్చక్రే చతుష్పదః - రెండు కాళ్లవి మనుష్య శరీరాలూ నాలుగు కాళ్లవి పశు మృగాది శరీరాలూ - ఇలాటి శరీరాలనే పురాలను సృష్టించి వాటిలో జీవ రూపంగా ప్రవేశించింది. అది సమష్టి శరీరంలో నైతే హిరణ్య గర్భుడన్నారు Cosmic Person. వ్యష్టి శరీరాలలో నైతే జీవుడన్నారు. Individual. దీనినే అన్నమూ అన్నాద Matter and mind అని చమత్కారంగా పేర్కొన్నారు. తినబడేది అన్నం తినేవాడు అన్నాదుడు. అంటే భోగ్యమైన జగత్తు. భోక్త అయిన జీవుడు.

  ఇవి రెండూ ఇలా ఏర్పడ్డాయంటే అది ఈరూపంగా ఖర్చయి పోకపోతే ఏర్పడవు. బంగారం ఖర్చుగాక పోతే సొమ్ములుగా

Page 73