#


Index

తతో విరా డజాయత విరాజో అధి పూరుషః - సజాతో అత్యరిచ్యత పశ్చా ద్భూమి మధో పురః

  ఇలా విస్తరించిన ప్రపంచమంతా ఆ పరమ పురుషుని మహిమ అని గదా పేర్కొన్నది పూర్వ మంత్రం. ఆ విస్తారమేమిటో ఎలాంటిదో వర్ణిస్తున్నాడిప్పుడు. తతో విరాడజాయత తతః అంటే ఆ మూలతత్త్వం నుంచే విరాట్. వివిధ రూపాలుగా రాజిల్లే దేదో అది విరాట్. చరా చర పదార్ధ రాశి గర్భితమైన బ్రహ్మాండమని భావం. అలాటి ఈ బ్రహ్మాండమంతా అజాయత జన్మించిందట. జన్మించిందంటే ఇది ఆరంభం కాదు. పరిణామం కాదు. వివర్తం. అంటే లేనిది రాలేదు. ఉన్నది మారలేదు. అదే ఇలా మరొక రూపంలో భాసిస్తున్నది అంత మాత్రమే.

  విరాజో అధి పూరుషః- ఇలా భాసిస్తున్నదంటే ఈ బ్రహ్మాండాన్ని Universe మరలా ఒక చైతన్యం అధిష్ఠించి దీన్ని నడుపుతున్నది. అదీ పురుషుడే. దీన్ని పూరించి ఉన్నది గనుక. పూరించట మంటే లోపల అంతర్యామి దూపంగా. వెలపల ఈశ్వర రూపంగా దీన్ని వ్యాపించి ఉంది. దీని మీద ఆధిపత్యం వహించి ఉంది. సజాతో అత్యరిచ్యత. ఇలా ఆ పురుషుడే ఈ పురుషుడుగా వివర్త రూపంగా జన్మించాడు. గనుక దీనిలోనే సమసి పోక దీని కతీతంగా కూడా ఉంటున్నాడు

Page 72