#


Index

  అది ఈ సంసార మహా సాగరమే. మహా లోతైనదిది. సుళ్లు తిరుగుతుంటుంది. విరుగు తుంటుంది. స్తనభరమంటే సుఖదుః ఖాది ద్వంద్వాలు. అవి ఈ జీవులను వంచుతున్నాయి. ముంచు తున్నాయి. అయినా శుభ్రమైన వస్త్ర ముత్తరీయంగా కప్పు కొన్నదంటే చైతన్య ప్రకాశం కూడా అక్కడే ఉన్నది మనకందకుండా. అందాలంటే ఆవిడ దాన్ని లక్షింప జేసే లక్ష్మి అయి మనల ననుగ్రహించాలి. అలా అనుగ్రహించిందా ఎవరినైనా - దివ్యమైన గజేంద్రులయి జీవించి పోయారు మనకు ముందే. గజేంద్రులంటే ముక్తజీవులైన మహానుభావులు. వారు అమూల్యమైన రత్న కలశోదకంతో ఆ మహాశక్తి నభిషేకించారు. రత్నకలశాలు వారి మనస్సులే. అందులో అమృత జలం ధారా వాహికమైన వారి వృత్తే. అలాటి పద్మహస్త మాంగళ్య యుక్త అయిన శ్రీదేవి నా మనోగృహంలో కూడా నిత్యమూ వసించాలి నాకా బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించాలని ఆకాంక్ష సాధకుడికి.

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాంవందేముకుందప్రియాం

  ఇంతకూ మనకు కావలసిన ఆలక్ష్మి ఎవరో గాదు. క్షీర సాగరం లాంటి ఈ సంసారంలో నుంచి ఆవిర్భవించినదే. శ్రీ రంగ ధామమంటే బ్రహ్మ విద్యకు యోగ్యమైన మానవుడి మనస్సు.

Page 49