పద్మాలయవు. వాటిలోనే నీ నివాసం. నివసిస్తే నీవు వాటి కుపాదానం. నడిపితే నిమిత్త కారణం. రెండూ నీవే. పద్మాదళాయ తాక్షివి. ఎప్పుడూ వాటి ప్రవర్తన నీవు గమనిస్తూనే ఉంటావు. విశ్వాని కంతా నీవు హితకారిణివి. నీకు విశ్వమంతా ఇష్టమైనదే. విష్ణువంటే విశ్వమే గదా. ఆయన మనస్సంకల్పాని కనుకూలంగా నీవూ విశ్వరూపాన్ని ధరించే మెలగుతుంటావు. అలాంటి నీమూల భూతమైన పరతత్త్వాన్ని నేను పట్టుకోవాలంటే ఆ పదాన్ని చూపే నీ పదమే మాకు శరణ్యం. కనుక నీ పాదం నామీద మోపు. నా మనసు కలాటి ఆలంబనం చూపమని దీని ఆంతర్యం.
యాసా పద్మాసనస్థా విపులకటి తటీ పద్మ పత్త్రియ తాక్షీ గంభీరా వర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వస్త్రోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రెర్మణి గణ ఖచితైః స్నాపితా హేమకుంభై ర్నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్య యుక్తా
మహా పద్మాటవీ సంస్థా అన్నట్టు పద్మాల లాంటి లోకాల నన్నింటినీ ఆసనం చేసుకొని కూచున్న మహాశక్తి అది. విపులమైన కటి మండల మంటే మధ్య దేశం కలది. మధ్య దేశం స్థితి కాలమే. అది సృష్టి లయాలు రెండింటి కంటే విశాలమైనదే గదా. ఇది ఆవిడ అచేతన రూపమైతే చేతనమైన దావిడ చూపు. అలాటి చూపుతో తన అచేతన దృశ్యాన్ని తానే చూస్తున్నది. అతి గంభీరమైన సుడిగుండం లాంటి దావిడ నాభి.
Page 48