#


Index

  అదే శ్రేష్ఠమైన ఆవృత్తికి కూడా నిలయం. అలాటి బ్రహ్మాకార వృత్తి మనసులో ఉదయించిందంటే ఇక దేవ వనితలంతా దానికి దాసులే కింకరులే. దేవత లెవరిక్కడ. చక్షురా దీంద్రియ వృత్తులు. అవన్నీ ఆ అఖండ వృత్తి చెప్పు చేతల్లో నడుచుకోవలసి ఉంటుంది. లోకాలకన్నిటికీ కలిపి దీపకాంతి అది ఒక్కటే. ఒకే ఒక జ్ఞాన దీప్తి వెలిగిస్తే వెలుగుతున్నాయీ సమస్త లోకాలూ. ఇదమంధం తమః కృత్స్నం జాయేత భువన త్రయ మన్నట్టు చైతన్య మనే దీప్తి లేకుంటే చేత్యమైన ఈ జగత్తంతా అంధకార బంధురమే గదా.

  అసలా బ్రహ్మ విష్ణు మహేశ్వరాదు లందరూ దేవతలని పేరే గాని వారి దివ్యత్వమూ వారి ఐశ్వర్యమూ అంతా ఆవిడ కడగంటి చూపు ప్రభావమే. అది మహాజ్ఞానం. మహాశక్తి. మిగతా అల్ప జ్ఞానమూ అల్పశక్తులూ అన్నీ అందులో జేరి పోయి దాని ఆధిపత్యంలో బ్రతక వలసినవే గదా. అలాటి త్రైలోక్య కుటుంబిని ఆ మహాశక్తి. అందరూ ఆవిడ సంతానమే. ఆవిడ పరివారమే. కుటుంబిని ఆదేవి. పరాదేవతే. ఇవన్నీ ఈ లోకాలావిడ సరసిజాలు. ఆ మహాశక్తి వివర్తాలు. అలాటి బ్రహ్మ విద్యారూపిణి అయిన ఆ శక్తిని దాసోహమంటే అదే ముకుంద మోక్షాన్ని ప్రసాదిస్తుంది మనకు. ప్రియం చేస్తుందని భావం.

Page 50