#


Index

సిద్ధి లక్ష్మీ ర్మోక్షలక్ష్మీ- ర్జయ లక్ష్మీ స్సరస్వతీ శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ శ్చ - ప్రసన్నా మమ సర్వదా -

  కేవలం మోక్షమనే ఫలమే కాదు. మోక్షం పారమార్ధికమైతే వ్యావహారికమైన జీవితంలో కూడా అన్ని సిద్ధులూ ప్రసాదించ గలదు. ఏ కార్యం తలపెట్టినా అందులో సాఫల్యమివ్వ గలదు. ఆయా విద్యలలో ఉత్తీర్ణులను చేయగలదు. శ్రీ అంటే ధనధాన్యాది సంపత్తి. అది కూడా లభింప జేయగలదు. ఇంతెందుకు కోరిన వరాలన్నీ ఒసగగలదు. ఇంతకూ ఆవిడను ప్రసన్నురాలిని చేసుకోటం మానవుడి వంతైతే వాటిని ప్రసాదించట మావిడ వంతు. ఇవన్నీ భోగాల క్రిందికి వస్తే మోక్షమనే దొక్కటే అపవర్గం. స్వర్గాపవర్గదా అని అందుకే వచ్చిందావిడకు పేరు. ఐహికాముష్మిక సుఖాలన్నీ అందించే సామర్థ్య మావిడకే ఉంది. మహాశక్తి గదా ఆవిడ. మహాశక్తి అన్నప్పుడి దేమిటి. అదేమిటి. అన్నీ ఇవ్వగలిగి ఉండాలి. అయితే ఇందులో సూక్ష్మమేమంటే ఇవి ఎన్ని ఇచ్చినా తాత్కాలికమే. ఆశాశ్వతమే. అది గుర్తించి మానవుడు వీటితో తృప్తి చెంది ఆగిపోక మోక్షాభిముఖంగా ప్రయాణం చేయాలి. అలా చేస్తాడా లేదా అని చూస్తుంటుందావిడ. చూచే సంసిద్ధత ఉంటే అప్పుడు వాణ్ణి మోక్ష లక్ష్మి అయి శాశ్వతంగా అనుగ్రహిస్తుంది.

Page 51