#


Index

  దానినిక్కడ అనుసంధానం చేసుకోవచ్చు మొత్తం మీద అలాటి మోక్ష లక్ష్మిని మోక్ష విద్యను జాతవేదో మమావహ. ఓ పరిమిత జ్ఞానరూపమైన మనసా నాకు ఆపాదించమని ప్రార్ధన.

  ఆర్దాం యః కరిణీం యష్టిం నువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం - జాతవేదో మ మావహ - యః ఎవడైతే అలా అందుకోవాలని కోరుతాడో వాడెవడో గాదు. జాతవేదో మమావహ. నేనే కనుక నాకే ఆ ఆర్ద్రమైన విద్యను ప్రసాదించు. కరిణీం యష్టిం సువర్ణాం హేమ మాలినీం. అది కరిణి. అన్నిటినీ నాకు సమకూర్చేది. ఒక యష్టి లాగా చేతి బెత్తంలాగా ఆలంబనమైనది. సువర్ణమైనది. మంచి ప్రకాశం గలది. హేమమాలిని. ఎడ తెగకుండా నిత్యమూ ప్రకాశించేది కూడా అది. సూర్యాం - సూర్యుడిలాగా దేదీప్యమానమైనదే గాక బుద్ధికి సంకేతం సూర్యుడంటే. బుద్ధికి ఆ చైతన్య ప్రకాశాన్ని అనుగ్రహించమని కూడా అర్ధమే. అది హిరణ్మయి లక్ష్మి. కనుక ఎప్పుడూ వాంఛనీయమే మానవుడికి.

తాం మ ఆవాహ జాతవేదో - లక్ష్మీ మనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వాన్ విం దేయం - పురుషానహమ్

  ఈ మంత్ర మింతకు పూర్వం వచ్చిందే. అదే మరలా ఆవృత్తమవుతున్నది. కాబట్టి దాని అర్థమే ఇక్కడా స్మరించవచ్చు.

Page 39