#


Index

  అంతకన్నా విశేషమేమీ లేదు. అభ్యాసమంటారు Repetation. దీన్ని. ఒక విషయం పదే పదే అభ్యాసమయ్యే కొద్దీ మనసులో బాగా గట్టి పడుతుంది. అందుకే వేదాంత గ్రంధాలలో కూడా మంత్రాలూ శ్లోకాలూ వాక్యాలూ తరుచుగా చెప్పినవే చెబుతుంటారు. అలాంటి వ్యవహారమే ఇదీ.

యశ్శుచిః ప్రయతో భూత్వాజుహుయా దాజ్య మన్వహం శ్రియః పంచ దశర్చంచ శ్రీకామ స్సతతం జపేత్-

ఇక్కడికి శ్రీ సూక్త భాగం సమాప్తమైనా దాని ఫలశ్రుతి భాగం మిగిలి పోయింది. దానినిప్పుడు వర్ణిస్తున్నారు. ఫలశ్రుతి అనే మాటే చెబుతుందది ఏమిటో. శ్రీసూక్త మర్థయుక్తంగా పారాయణం చేస్తే కలిగే ఫలితమేమిటో అది వినాలి మనం. అదే ఫల శ్రుతి.

యశ్శుచిః ప్రయతో భూత్వా- జుహుయా దాజ్యమన్వహం శ్రియః పంచ ద శచర్చంచ - శ్రీ కామ స్సతతం జపేత్

  ఎవడైతే స్నానాచమనాదులు చేసి శుచి అయి నియమ నిష్ఠలతో అన్వహం ప్రతిదినమూ ఆజ్యంజుహుయాత్- అగ్నిలో ఆజ్యాన్ని హోమం చేస్తాడో - పంచ దశర్చంచ - అంతే కాక శ్రీదేవికి సంబంధించిన పంచదశి పారాయణం చేస్తాడో శ్రీకామః వాడికి భోగ భాగ్యాల మీద కోరిక ఉంటే మాత్రం సతతం జపేత్ వాడీ శ్రీ సూక్తాన్ని నిరంతరమూ జపించ వలసి ఉంటుంది.

Page 40