ఆర్రాం పుష్కరిణీం పుష్టిం -
పింగళాం పద్మమాలినీం -
చంద్రాం హిరణ్యయీం లక్ష్మీం -
జాతవేదో మమా వహ
అది ఎలాంటిదా విద్య అంటే దాని లక్షణాలు వర్ణిస్తున్నాడు. ఆర్థ అది. పుష్కరిణి అది. చాలా సౌమ్యమైనదా విద్య. భయానకమైనది కాదు. ప్రాపంచికమైన వెంత పోగు చేసుకొన్నా అవి ఎప్పటికైనా తొలగిపోయే భయముంది వాటిలో. ఇది అలాటిది కాదు. బ్రహ్మతత్త్వమెంత శాంతమూ స్తిమితమైనదో దాని జ్ఞానం కూడా అలాంటిదే. అది ఎంత పుష్కలమైనదో ఇదీ అంత పుష్కలం. అంటే పరిపూర్ణం. రలయో రభేదః అన్నారు పుష్కరమూ పుష్కలమూ ఒకటే. పుష్టిం. పుష్కలత్వం దానికి తెచ్చి పెట్టుకొన్నది కూడా కాదు. సహజం. పుష్టి దాని స్వభావమే. నిత్య పుష్టా అని పేరు అమ్మవారికి. పింగాళాం పద్మ మాలినీం. అంతేగాక అది పింగళ. పద్మమాలిని. పింగళ మంటే పసుపు వన్నె. బంగారాని కుపలక్షణమది. బంగారం జ్ఞాన ప్రకాశానికి ద్యోతకం. హిరణ్మయీ మని గదా శ్రీ దేవిని సంబోధించారు మొదట. పోతే పద్మము లంటే అండ పిండాదు లన్నింటినీ వ్యాపించి ఉన్నదా శక్తి. మహా పద్మాటవీ సంస్థ అని అందుకే పేర్కొన్నారా మహాశక్తిని. అదే పద్మమాలిని. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం. ఈ మూడు మాటలకూ అర్థమింతకు ముందే వివరించి ఉన్నాము.
Page 38