ప్రతి మానవుడి మనస్సుకూ కలిగే కోరిక అదే. అదే వాడి ఆ కూతి కూడా. దేన్ని పొందాలని లోలోపల ఆసిస్తుంటాడో అది ఆకూతి. ఏదో గాదది. వాచస్పత్యం. వాక్కు కధిపతి వాచస్పతి. వాక్కంటే బ్రహ్మ విద్య. దాని ద్వారా పొందేది వాచస్పతి. దాని భావం వాచస్పత్యం. అది పొందాలని కోరుకోవాలి ప్రతి మానవుడూ. అయితే దాని నెలా పొందాలి. ఏమిటి ఉపాయం. అదే వాక్కు వాక్కన్నా లక్ష్మి అన్నా శ్రీ అన్నా ఒక్కటే. వాక్కే దారి చూపుతుంది వాచస్పతి అయిన పరమాత్మను పొందటానికి. అలాటి కామ మనండి ఆకూతి అనండి. అది తీవ్రంగా కలిగినప్పుడే అశీమహి, పొందగలం. సందేహం లేదు.
అయితే అలాటి జిజ్ఞాస ఎలా కలుగుతుందంటారు. మనసులోనే కలగాలది. మనసు కూడా బలహీనమయితే సుఖం లేదు. చాలా బలిష్ఠమైన మనసు కావాలి. పశునాం రూప మన్నస్య. బలమెలా వస్తుంది. అన్నమయం హి సోమ్య మనః అన్నారు. ఆహారం వల్లనే లభిస్తుందది. ఆహార శుద్ధే సత్త్వ శుద్ధి అని గదా చెప్పాడు సనత్కుమారుడు. పశువుల కదే రూపం. పాశ్యతే ఇతి పశుః సంసారంతో కట్టుపడ్డ మానవుడే ఒక పశువు. వాడి రూపం అన్నమయమైన మనస్సే. యశః అదే బ్రహ్మాకార వృత్తిని కూడా అలవరుచుకొని వాడికి కీర్తి ప్రతిష్ఠలు తెస్తుంది. కాబట్టి అలాటి బ్రహ్మ విద్యా జన్యమైన యశస్సు శ్రీః శ్రయతామ్ . ఆ శ్రీ మాత నాకందివ్వాలని కోరుకోవాలి
Page 35