అదే ఈశ్వరి ఐశ్వర్యం. అలాంటి శక్తి మనలో చేరిపోతే మనకిక అడ్డమేముంది. అదే అన్ని ఆలోచనలనూ అరికట్టి మనలను సాధన మార్గంలో చక్కగా నడపగలదు. కనుక దానినే ఆవాహన చేసుకోవాలి మనమెప్పుడూ.
శ్రీ ర్మే భజతు - అలక్ష్మీర్మే నశ్యతు. ఏమని ఉండాలి మానవుడి
కాశంస Aspiration. శ్రీయే ఎప్పుడూ నన్ను భజించు గాక. అలక్ష్మి నశించుగాక అని ఉండాలి మన కామన. శ్రీ భజిస్తే అది లక్ష్మి గనుక మనకు మోక్ష మార్గాన్ని చూపుతూ పోతుంది. దానికి భిన్నమైన అలక్ష్మి మనకు మార్గం చూపదు గనుక దాన్ని మనసుకు తెచ్చుకోకపోతే తొలగిపోతుంది. అంతా మానవుడి భావనను బట్టి ఉంటుంది. సంసారమంతా పరమాత్మ భావనే అయినప్పుడు దాన్ని సాయుజ్యంగా దర్శించటం కూడా జీవాత్మ తాలూకు భావనే గదా. భావనా గమ్యా అని అమ్మవారి నామం. ఏది తీవ్రంగా భావిస్తే అది అవుతాడనేది గొప్ప సూత్రం. అందుకే తద్భావ భావితః అని చాటుతున్నది గీత. సత్యాభి సంధి అనృతాభి సంధి అని ఛాందోగ్య మన్నదంటే ఇదే దాని అంతరార్థం. సత్య భావనతో నిష్క్రమిస్తే మానవుడు సత్యస్వ రూపుడుగానే నిలిచి ఉంటాడు. అసత్య భావనతో వెళ్లిపోతే అసద్రూపమైన సంసార బంధమే వాడికి ప్రాప్తి.
మనసః కామ మాకూతిం -
వాచస్పత్య మశీమహి
పశూనాగం రూప మన్నస్య -
మయి శ్రీః శ్రయతాం యశః
Page 34