అయన మంటే రెండర్థాలున్నాయి. ఒకటి గమ్యమని రెండవది ప్రయాణమని. గమ్యం చేరాలంటే ప్రయాణం చేయాలి. గమ్యానికి మరొక మార్గం లేదు జ్ఞానం తప్ప అని మొదటి మంత్రం చెబుతున్నది. ఇక్కడ మరొక మార్గమే లేదు గమ్యాని కని మార్గానికి ప్రాధాన్యమిస్తున్నది. అక్కడ ప్రయాణానికి మార్గం లేదంటే ఇక్కడ గమ్యానికి వేరే మార్గం లేదని మాట. ఒకచోట గమ్యానికి మరొక చోట గమకానికి ప్రాధాన్యమిచ్చి మాటాడటం వల్ల గమ్య గమకాలు రెండూ ఏమరకుండా పట్టుకోవాలి సాధకుడని హెచ్చరించి నట్టవుతున్నది.
ప్రజాపతి శ్చరతి గర్భేంతః - అబాయమానో బహుధా విజాయతే - తస్యధీరాః పరిజానంతి యోనిం - మరీచీనాం పద మిచ్ఛంతి వేధ సః
అయితే ఇంతకూ మనం సాధించి పట్టుకోవలసిన ఆ పురుషోత్తమ స్వరూప మెక్కడ ఉంది. ఎలా ఉంది. దాని చిరునామా ఏమిటో తెలిస్తే గదా దాన్ని గుర్తించే ప్రయత్నమంటూ చేయగలం. తెలియనంత వరకూ ఎంత ఉబలాట పడి ఏమి సుఖమని ప్రశ్న వచ్చింది మరలా. వస్తే దానికిప్పుడీ మంత్రం సమాధాన మిస్తున్నది.
Page 105