#


Index

   ప్రజాపతి శ్చరతి గర్భే అంతః - ప్రజాయంతే ఇతి ప్రజాః - అనేక రూపాలుగా జన్మిస్తున్న ఈ చరా చర పదార్ధాలే ప్రజ. వీటన్నిటి గర్భంలోపల చరతి నిత్యమూ సంచరిస్తూ ఉన్నాడు. ఎవరు. ప్రజాపతి. వీటిని సృష్టించిన ఆ పురుషుడు. సృష్టించి దూరమై పోలేదు. అలాగైతే ఎప్పటికీ ఆయన పొలకువ మనకు తెలియదు. మరేమిటంటారు. అది కేవలం నిమిత్త కారణమే గాక ఉపాదానం కూడా అయినందువల్ల సృష్టి అంతా వ్యాపించే ఉన్నదా తత్త్వం. అంతర్బహిశ్చ భూతానాం. మంత్ర పుష్పంలో కూడా వచ్చిందీ భావం. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు అని శ్లోకం. అక్కడ ఈ భావమే ప్రతిధ్వనిస్తుంది. రెండూ నారాయణ సూక్తాలే గదా. పోలిక లేకుండా ఎలా పోతుంది. అదే మంత్ర పుష్పారంభంలో కూడా వివరించబోతాము. అప్పటికా మూల పదార్ధ మెక్కడా ఏమిటి అని ప్రశ్నే లేదు. ఎక్కడ బడితే అక్కడ మనం చూచే ఈ ప్రపంచంలోనే ఉంది. అయితే వస్తు సిద్ధంగా ఉన్నా గర్భే అంతః ఎక్కడో లోపల గుప్తంగా మరుగు పడి ఉంది. అధిష్ఠాన Base మెప్పుడూ మరుగు పడే ఉంటుంది. ఆరోపితం లాగా బయటపడి కనిపించదు.

  అయితే ఈ ఆరోపిత మేమిటి. దీనికీ దానికీ ఏమిటి సంబంధం. అజాయ మానో బహుధా విజాయతే. అది అజాయ మాన మా మూలతత్త్వం. దానికి జన్మ లేదు. మొదటి నుంచీ ఉన్నది.

Page 106