#


Index

  సిద్ధ మది Ready made. సాధ్యం కాదు. మరి ఇదో. బహుధా విజాయతే. ఇదంటూ ఒక పదార్ధమేదీ లేదు దాని కన్యంగా. అదే బహుధా చిత్ర విచిత్రమైన రూపాలలో విజాయతే. విభక్తమయి కనిపిస్తున్నది. జన్మ లేనిదే ఆయా ఉపాధుల రూపంలో జన్మిస్తున్నది. జన్మ లేనిదెలా జన్మించ గలిగింది. అదే మాయ. స్వరూపతః తన పాటికితా నద్వితీయంగానే ఉంది. కాని తన మాయా ప్రభావంతో ఎన్నో రూపాలుగా అవతరించినట్టు దర్శన మిస్తున్నది. అది స్వరూపమైతే ఇది దాని మీద ఆరోపితమైన తదీయ విభూతి. ఇదీ రెంటికీ సంబంధం. స్వరూప విభూతుల కున్న సంబంధం. ఆధ్యాసికమైన సంబంధమని పేర్కొంటారు వేదాంతులు. ఇదీ కారణమది మరుగుపడి మనకు కనపడకుండా పోవటానికి.

  అయితే మరి ఆ మరుగు తొలగించి దాన్ని దర్శించట మెలాగా అని మరలా ప్రశ్న. దానికే సమాధాన మిస్తున్నారు. తస్య ధీరాః పరిజానంతి యోనిం. యోని అంటే దీనికి మూలస్థానమైన ఆ పదార్ధం. ఇవి గదా దాన్ని కప్పేశాయి. ఈ కప్పిన నామరూపాలు కూడా ఏవో కావు. అదే ఇలా విస్తరించి ఉంది. కనుక ఇదంతా అదేనని ఆ దృష్టితో ఈ దృశ్య ప్రపంచాన్ని చూచి సమన్వయించుకోటమే ఉపాయం. ధీరాః దానికెంతో ధైర్యముండాలి సాధకుడికి. ఎలాటి ధైర్యం. పరిజానంతి. పరితః జానంతి - ఎటు చూస్తే అటు విస్తరించి ఉన్నదంతా అస్తి భాతి ఉంది ఉన్నట్టు భాసిస్తున్నది.

Page 107