#


Index

  ఉండటమనే స్ఫురణ తప్ప మరేమీ లేదనే చూపుతో చూడాలి ప్రతి ఒక్కటీ. అప్పుడది తనలోనే దాగి ఉన్న తత్త్వాన్ని తన పాటికి తానే బయటపెట్టి చూపుతుంది. ఈ భావమే తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వామని చాటి చెబుతున్న దుపనిషత్తు మనకు.

  అయితే ఎవరికంటే వారికా సామర్థ్యం లేదు. ధీరులయి ఉండాలి వారు. ధైర్యమనే గుణముండాలి. ఏమిటా ధైర్యం. మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః - విధించే వాడెవడో వాడు వేధ. చరాచరాలను సృష్టించిన వాడని అర్థం. వాడి పదం స్థానం. వాడెక్కడ ఉన్నాడో ఆ స్వరూపం ఇచ్ఛంతి. దాన్ని చూడాలనే కోరిక బలంగా ఉండాలి మానవుడికి. దీన్నే యమే వైష వృణుతే అనే మాటలో సూచించింది ఉపనిషత్తు. అయితే దాన్ని చేరేందుకు తోడ్పడేది ఏది మనకు. మరీ చీనాం పదం - మరీచి అంటే కిరణం. సూర్యమండలం లాంటిదది అయితే సూర్యకిరణాల లాంటివి దానిమీద అధ్యారోపితమైన నామరూపాలు. ఈ కిరణాలను పట్టుకొని పోతే ఇవే దారి చూపుతాయా మండలానికి. ఇది ఒక ప్రయాణం లాంటిదీ సాధన. ఒక బస్సులో కూచొని ప్రయాణమయి పోతున్నామంటే అదే దారి చూపుతూ పోతుంది గమ్యస్థానానికి. ఆ మార్గంలోనే పయనిస్తున్నప్పు డది చేరటంలో అభ్యంతర మేముంది.

Page 108