మరీచి అంటే మరొక అర్థం కూడా ఉంది. మరీచి అంటే ఎండమావులు. ఎండమావులు జలం గాకపోయినా జలంలాగా భాసిస్తుంటాయి. ఇది ఏమిటా అని విచారణ చేసే కొద్దీ అది ఏ సూర్యరశ్మి వికారమో ఆ రశ్మినే క్రమంగా బయటపెట్టి చూపుతుంది. అసతోమా సద్గమయ అనే మాట కిదే అర్ధం. అసత్యం ద్వారానే సత్యాన్ని పట్టుకోవాలి. కారణం. అసత్యమంటూ అసలేదీ లేదు సృష్టిలో. సత్యమే ఉన్నది. నీ వ సత్యమని దేన్ని చూస్తున్నావో అది సత్యమే నీ దృష్టి కసత్యంగా కనిపిస్తున్నది. కనుకనే వివేచన చేస్తే ఇది మరలా సత్య స్వరూపంగానే సాక్షాత్కరిస్తుంది. అప్పుడ సత్యం సత్యమనే వికల్పం తొలగిపోయి అంతా ఏకైకమైన సత్యమేననే అద్వైత భావం అనుభవానికి వస్తుంది. ఇదీ ఇందులో ఉన్న సూక్ష్మం.
యో దేవేభ్య ఆ తపతి - యో దేవానాం పురోహితః - పూర్వో యోదేవేభ్యో జాతః - నమో రుచాయ బ్రాహ్మయే -
పోతే ఇప్పుడలాటి బ్రహ్మ స్వరూపానికి చెందిన జ్ఞానమేదో దాని నందిస్తున్నదీ మంత్రం మనకిప్పుడు. ఏదైనా ఒకటి మన అనుభవానికి రావాలంటే దానికి సంబంధించిన జ్ఞానమేర్పడాలి మనకు. దీనికే వృత్తి అని పేరు. గృహానికి చెందినది గృహాకార వృత్తి. వనానికి చెందినది వనాకార వృత్తి. The Idea of a Thing. వృత్తి అనేదే ప్రమాణం.
Page 109