#


Index

  దాని ద్వారానే పట్టుకోవాలి అందులో ప్రతిఫలించిన ప్రమేయాన్ని. ప్రస్తుతం పరమాత్మ అనే దొక ప్రమేయం. To be known. అంటే తెలుసుకోవలసిన పదార్థం. అందుకే అదీ ఒక ప్రమేయమని పేర్కొన్నది మంత్ర పుష్పం. మన స్వరూపమేనని గుర్తించే వరకూ తాత్కాలికంగా ప్రమేయమని భావించాలి గదా. అందుకని ప్రమేయమన్నారు.

  సరే ఇప్పుడా ప్రమేయం గాని ప్రమేయాన్ని అందించే జ్ఞానమేమిటి. అదే బ్రహ్మాకార వృత్తి. ఎలా కలుగుతుందది. యోదే వేభ్య ఆతపతి దేవతలంటే ఇక్కడ మన ఇంద్రియాలు. అవీ ప్రకాశిస్తూనే గదా ఉంటాయి. అందుకే దేవ అన్నారు. అందులోనూ మనోవృత్తులు మరీ ప్రకాశిస్తుంటాయి. దేవేభ్యః అంటే చిత్ర విచిత్రంగా ఏర్పడే చిత్త వృత్తులని అర్థం. కాగా వీటికి అతీతమైన విలక్షణమైన వృత్తి ఒకటి ఉంది. అది ఆతిపతి. ఈ వృత్తులన్నిటినీ వ్యాపించిన ఒక వెలుగు. ఒక ప్రకాశం. ఆ ప్రకాశంలో ప్రకాశిస్తున్నాయీ ఆలోచనలన్నీ. వీటికి వెనకాల జేరి వీటిని ప్రకాశింప జేస్తున్నదదే. ఒక దీపకాంతిలో వస్తువులు ప్రకాశిస్తున్నట్టు ప్రకాశిస్తున్నాయీ వృత్తులన్నీ ఆ అఖండమైన బ్రహ్మాకార వృత్తిలో.

  యో దేవానాం పురోహితః - అదే ఈ ఇంద్రియ వృత్తులన్నింటికీ పురోహితుడు. ముందున్న వృత్తి. అంతేకాదు. పూర్వో యోదేవేభ్యోజాతః

Page 110