#


Index

  వీటన్నిటి కంటే ముందే ఏర్పడిందది. ప్రకాశం ముందుంటే గదా ప్రకాశించే మిగతా వస్తువులన్నీ ప్రకాశిస్తుంటాయి. అలాగే అస్తి భాతి అనే ప్రకాశమొకటి ముందుంటేనే అందులో ప్రతి ఒకటీ అస్తి అనీ భాతి అనీ విశేష రూపంగా స్ఫురిస్తున్నది మనకు. అది సామాన్యమైతే ఇవన్నీ దాని విశేషాలు. నమో రుచాయ బ్రాహ్మయే. అంచేత బుద్ధిమంతుడైన మానవుడు వీటిని గాదు పట్టుకోవలసింది. విశేషాలను పట్టుకొంటే పరిష్కారం లేదు సమస్యకు. మీదు మిక్కిలి సమస్యనింకా జటిలం చేస్తాయి విశేషాలు. అదే గదా ఈ సంసారం. కనుక వీటన్నింటినీ వ్యాపించిన ఆ సామాన్య వృత్తిని పట్టుకోవాలి మనం. అప్పుడది వీటికి జవాబు చెప్పగలదు. అదే రుచాయ బ్రాహ్మయే. బ్రహ్మ సంబంధి అయినది బ్రాహ్మం. ఏమిటది. రుచి. రుచి రుక్కంటే ప్రకాశం. జ్ఞాన ప్రకాశం. బ్రహ్మాకార వృత్తి అని అర్థం. దానికి నమః - నమస్కార మంటున్నది మంత్రం. అంటే దానికి వశమైపోవాలి నీ మనస్సని భావం. మిగతా ప్రపంచ వృత్తులన్నీ దాని కధీనమయి అందులోనే ప్రవిలయ మయి పోవాలి. అదే అసలైన నమస్కారం. శరణాగతి.

  అసలీ రుచి అనండి. ప్రకాశ మనండి. ఎలా ఏర్పడింది. అంతకు ముందు లేనిది గదా ఇది. అంతకు ముందు నుంచీ ఉన్నది బ్రహ్మమే గాని బ్రహ్మ జ్ఞానం కాదు.

Page 111