#


Index

   అసలు అర్థం లేని చదువు వ్యర్ధమన్నారు. వేదంలోనే ఒక మాట ఉన్నది. స్థాణు రయం భారహరః కిలాభూత్ - అధీత్య వేదం న విజానాతి యోర్థమ్. అర్థం తెలియకుండా ఎవడు వేదాధ్యయనం చేస్తుంటాడో వాడు కేవలం వేద శబ్దభారాన్ని మోస్తున్నాడు. బరువు మోసే కూలి వాడెలాటి వాడో వీడూ అలాటి వాడే. యదధీత మవిజ్ఞాతం - నిగదేనైవ శబ్ద్యతే అనగ్నా వివ శుషెధో - నత జ్జ్వలతి కర్షిచిత్ - ఊరక మంత్రా లేకరువు పెడుతుంటాడే గాని అర్థజ్ఞానం లేదు వాడికి. వట్టి కట్టెలెన్ని పోగు చేసి వాటినెంత పొగ గొట్టం పెట్టి ఊదితే ఏమి ప్రయోజనం. నిప్పు కణిక వేయకపోతే మండుతుందా. నిప్పు కణిక లాంటిది జ్ఞానం. అది లేని మాటలన్నీ శుష్కమైన కట్టెల లాంటివేనని చీవాట్లు కూడా పెడుతున్నది శాస్త్రం. కాబట్టి శబ్రోచ్చారణ చేస్తున్నావంటే అది ఏమి చెబుతున్నదో దాని అర్థం మీద కూడా చూపుండాలి నీకు. అయితే అర్థజ్ఞానం లేకున్నా శబ్దాచ్చారణ చేస్తూ కర్మ లాచరించినా ఫలితముందని మహా అయితే జ్ఞానంతో చేస్తే వీర్యవత్తరం భవతి అని కూడా చెప్పింది గదా వేదమని అడగవచ్చు. అది మరీ మనం బద్దకిస్తామని మనచేత కర్మలు యధావిధిగా చేయించాలని చెప్పిన ప్రశంసా వాక్యమే గాని యధార్థం కాదు. అదే యధార్ధమైతే ముందు చెప్పిన మాటల కర్థం లేదు. కాబట్టి శబ్దార్ధ జ్ఞాన మనేది ఆవశ్యకం.

Page 6