

దానివల్ల ఎంతైనా మాలిన్యం నా మనస్సులో పేరుకొని ఉండవచ్చు. అది అడ్డు తగులు తున్నంత వరకూ పరిశుద్ధికి నోచుకోలేను. ఏమిటీ కాలుష్య మెక్కడి నుంచి వచ్చింది. యద్రాత్రియా పాప మకార్షమ్. నేను రాత్రి కాలంలో చేసిన పాప మంటున్నాడు. ఇది ప్రాతః కాల సంధ్య గదా. అంచేత రాత్రి చేసిన పాపం. దేనితో చేశామా పాపం. మనసా వాచా హస్తాభ్యాం మనసుతో కావచ్చు. మాటతో కావచ్చు. చేతులతో కావచ్చు. పద్యాం - కాళ్లతో కావచ్చు. ఉదరేణ శిశ్నా - ఆఖరుకు ఉదరంతో శిశినంతో దేనితోనైనా కావచ్చు. మొత్తం మీద మనకున్న అన్ని ఇంద్రియాలలో దేనితో చేసినా చేయవచ్చు పాపం. ఎప్పటికప్పుడు దాని ప్రభావం మనమీద పడకుండా మన దారి కడ్డు రాకుండా కడిగేసుకొంటుండాలి. త్రికరణ శుద్ధి ఏర్పడుతుందప్పుడు. అప్పుడే చేసే కర్మ పరిశుద్ధ మవుతుంది.
మరి వాటిని శుద్ధి చేయవలసిందెవరు. రాత్రి స్తదవ లుంపతు. ఏ రాత్రి చేశామో ఆ రాత్రే దాన్ని పోగొట్టాలని అర్థం. రాత్రంటే రాత్రి కాలమని గాదు. దానికా సామర్థ్యం లేదది జడం. పోతే రాత్రి కాలాన్ని అభిమానించే దేవత ఏదుందో అది శక్తి రూపిణి కాబట్టి దానికే ఉంది సామర్ధ్యం పోగొట్టటానికి. రాత్రి అనే ఉపాధి ద్వారా పనిచేసే ఆ దివ్య శక్తి ఏదుందో అది పోగొట్టు గాక అని అర్థం. అంతే కాదు. యత్కించ దురితం మయి. ఏ కొంచెం నాలో పాప కర్మ మిగిలి ఉన్నా సరే.
Page 50
