#


Index

   సూర్యుడు గాయత్రికి మూలస్థానం. ఆ తేజస్సదే. తత్సవితుర్వరేణ్యం భర్గః అంటే అర్థమదే గదా. కనుక సూర్యశ్చ అనటంలో ముందు సవితను స్మరించాడు. తరువాత సావిత్రిని స్మరిస్తున్నాడు మన్యుశ్చ అని. సవిత నుంచి వచ్చిందే సావిత్రి. సావిత్రి గాయత్రే. ఇంతకూ మన్యు అంటే గాయత్రీ మంత్రం. పోతే సూర్యుడయింది. సూర్యతేజస్సయిన గాయత్రి అయింది. పోతే మన్యుపతయశ్చ. ఆ గాయత్రీ మంత్రాన్ని దర్శించిన మహర్షులు. మన్యుపతులు. విశ్వామిత్రాదులు. పాతీతి పతిః మంత్ర రహస్యాన్ని కాపాడే వారని భావం. అప్పటికే మయింది. ఈ మూడు మాటల్లో మంత్రంలో ఉండే మొదటి మూడు మాటలకూ అర్థం కలిసి వచ్చింది. సవితుః అనేది సూర్యుడికీ మన్యువనేది వరేణ్యం భర్గః అనే సూర్యతేజస్సుకూ ధీమహి అనేది దాన్ని తమ దివ్య దృష్టితో దర్శించారని చెప్పే మహర్షుల బుద్ధి బలానికీ మూడింటికీ మూడూ సరిపోతున్నాయా లేదా.

   కాగా ఇప్పుడు వీరందరినీ మనం స్మరించటం దేనికి. ఏమి చేయాలి వీరు మనకు. మన్యు కృతేభ్యః పాపేభ్యః రక్షంతాం నా పాపాల లోనుంచి నన్ను బయట పడేయాలని ప్రార్ధన. ఎన్నో చేసి ఉంటాము పనికి రాని పనులు. ఎందుకు చేశా మవన్నీ. మన్యుకృతేభ్యః - మన్యువంటే ఇక్కడ కోపమని అర్థం. రాగద్వేషాలనే ద్వంద్వాలు నాచేత ఎన్నెన్నో పాపకార్యాలు చేయించి ఉండవచ్చు.

Page 49