#


Index

   ఏ పని చేసినా అది బ్రహ్మమే. సర్వమూ బ్రహ్మం వైపే ప్రయాణం చేస్తున్నట్టు కలుగుతుంది అనుభవం. అది ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాయా శ్లోకాలు.

  ఆకాశాత్పతితం తోయం - ఆకాశంలో మేఘాలు తయారయి వర్షం కురుస్తుంటుంది. నేలమీద పడ్డ ఆ జల మక్కడ నిలవదు. యధాగచ్ఛతి సాగరం. సాగరంలో కలిసే దాకా అది ప్రవహిస్తూనే పోతుంది. సాగరమే దానికి గమ్యం. నదీనాం సాగరో గతిః అన్నారు. అలాగే సర్వదేవ నమస్కారః - నీవు ముక్కోటి దేవతలలో ఎవరికి చేయి నమస్కారం. అది ఒక నది లాంటిదా దేవత. దానికి చేసిన స్తుతి నమస్కారాదులన్నీ చివరకు సముద్రం లాంటి కేశవం ప్రతిగచ్ఛతి. పరా దేవత అయిన పరమాత్మకు చెందేదే. కేశవ అనే మాట క అ ఈశ. అంటే త్రిమూర్తులుగా భాసించే అమూర్తమైన పరమాత్మ అనే అర్ధం.

   అంతే కాదు. సర్వేవేదేషు యత్పుణ్యం - సర్వతీర్థేషు యత్ఫలం వేదాలన్నీ వల్లిస్తే ఏ పుణ్యం లభిస్తుందో - గంగాది తీర్ధాలన్నిటిలో మునిగితే ఏ ఫలం లభిస్తుందో - తత్ఫలం పురుష ఆప్నోతి. ఆ ఫలిత మంతా మానవుడు పొందగలడు. ఎలాగ. అవన్నీ సేవించి కాదు. స్తుత్వా దేవం జనార్దనమ్ - జనులందరికీ ప్రార్ధనీయుడైన ఆ పరమాత్మను ఆరాధిస్తే చాలు. వీటన్నిటి ఫలమూ అందులోనే కలిసి వస్తుంది. ఇవి వ్యష్టి అయితే అది సమష్టి. సమష్టిలో వ్యష్టి లయం కాక తప్పదు.

Page 139