భూతం దేవానా మవమే అవోభిః - మీరు దేవతలనూ రక్షించగలరు మాబోటి మానవులనూ కాపాడగలరు. దేవతలెవరో గాదు - మా మనః ప్రాణాదికరణ వర్గమే. ఇవి మీ మీద బ్రతుకు తున్నాయి. వీటి కాహారం పానీయం మీరేగదా ఇస్తున్నారు. విద్యామ ఇషం - మీవల్లనే ఇంత తిండి తిని బ్రతుకు తున్నాము. వృజినం జీర దానుం - నిర్దుష్టమైన మాకు జీవనాధారమైన దదే. దానివల్లనే శరీరమూ మనసూ పనిచేస్తున్నాయి. తన్మూలంగానే బ్రహ్మ జ్ఞానానికీ నోచుకొన్నాము. కనుక మీకు మేమెప్పుడూ కృతజ్ఞులమే.
ఆకాశాత్పతితం తోయం యధా గచ్ఛతి సాగరం సర్వదేవ నమ స్కారః - కేశవం ప్రతి గచ్ఛతి సర్వ వేదేషు య త్పుణ్యం - సర్వ తీర్థేషు యత్ఫలం తత్పలం పురుష ఆప్నోతి - స్తుత్వా దేవం జనార్దనం వాసనా ద్వాసు దేవస్య -
వాసితం తే జగత్రయం సర్వభూతనివా సోసి వాసు దేవ నమోస్తుతే
ఈ విధంగా సర్వమూ బ్రహ్మమే నని వస్తు సిద్ధంగానే గాక అది మనకు బుద్ధి సిద్ధం కూడా ఎప్పుడవుతుందో అప్పుడిక చెప్ప బని లేదు. సృష్టిలో తేడా అనేది ఏ మాత్రమూ కనిపించదు. ఏది చూచూ బ్రహ్మమే.
Page 138