ప్రయాతుం బ్రహ్మ లోకం. బ్రహ్మైవ లోకః బ్రహ్మ లోకః అన్నారు భాష్యకారులు. బ్రహ్మ సాయుజ్యమన్న మాట. అది పడయటానికి నీవే నా కాలంబనం. విద్యయా అమృత మశ్నతే అన్నారు. అలాటి బ్రహ్మ విద్యవు నీవే గనుక నీవల్ల నేనా సాయుజ్యానికి నోచుకోగలను. అది నాకు సిద్ధమయిందని విశ్వసించినప్పుడే నీకు నేను వీడ్కోలు చెబుతున్నాను. నీవు యధేచ్ఛగా వెళ్లవచ్చు నంటాడు.
ఇదం ద్యావా పృధివీ సత్యమస్తు - పిత ర్మాత ర్యది హోప బ్రువే వాం - భూతం దేవానా మవమే అవోభిః - విద్యా మేషం వృజినం జీర దానుమ్ -
ఇప్పుడు నేను చెబుతున్న మాట సత్యమో కాదో నని శంకించనక్కర లేదు. కావలిస్తే ఇది యధార్ధమని చెప్పటానికి ఈ ద్యావా పృధువులే సాక్షులు. పైన ఆకాశమూ క్రింద భూమి. ఈ రెండింటి మధ్యనే బ్రతుకుతున్నాడు మానవుడు. ఎవరో కాదు. వారిద్దరూ నాకు తల్లిదండ్రులు. పితర్మాతః ఆకాశము తండ్రి - భూమి తల్లి. అది వర్షిస్తే ఇది ఫలిస్తుంది. దానివల్లనే మా జీవితం నడుస్తున్నది. కనుక అవే నాకు తల్లిదండ్రులని వారిని సంబోధిస్తున్నాడు. యది హోపబ్రు వేవాం సత్యమస్తు. నేను మీ సమీపంలో అన్న ఈ మాట వాస్తవమని మీకు తెలియదా. తెలుసు.
Page 137