దానికి కారణ మొక్కటే. సమష్టి అంటే సామాన్యం సర్వత్రా వ్యాపించి ఉంటుందది. సర్వత్రా అంటే విశేషాన్నింటినీ అని అర్ధం. ఏమిటా విశేషాలు. బాహ్యమైన రూపాలన్నీ సద్విశేషాలు. ఆంతరమైన నామాలూ లేదా భావాలన్నీ చిద్విశేషాలు. Both Things and Ideas. వీటన్నిటిలో పరుచుకొని ఉన్నదే దంటారు. ఆసచ్చిద్రూపమైన సామాన్యమే. అదే వాసుదేవ అంటే.
వాసనా ద్వాసు దేవస్య వాసితంతే జగత్ప్రయం. ఈ మూడు లోకాలూ వాసితమయి ఉన్నాయి ఆ వాసుదేవ వాసనతో. ఈశావాస్య మిదగ్ం సర్వం యత్కించ జగత్యాం జగత్తని ఉపనిషత్తే ఘోషిస్తున్నది. ప్రతి ఒక్కటీ అది దృష్టం గాని ఆనుశ్రవికం గాని అస్తిభాతి అనే గదా చూస్తున్నావు. ఆ రెండు భావాలూ వదిలేసి ఏదైనా పట్టుకోగలదా నీ బుద్ధి. కనుక సర్వభూత నివాసోసి వాసుదేవ - ఓ సచ్చిదాత్మకమైన పరమాత్మా! సమస్తమైన చరా చర పదార్థాలలోనూ నీవే నివసిస్తున్నావు నీలోనే మరలా ఆ పదార్ధాలు నివసిస్తున్నాయి. ఆధారా ధేయాలు రెండూ నీవే. ఇక ఈ ప్రపంచ మెక్కడిది. జీవకోటి ఎక్కడిది. ముక్కోటి దేవత లెక్కడున్నారు. అదంతా మూడు భంగిమలలో వ్యాపించిన నీ విభూతే సుమా. కనుక నమోస్తుతే నీకు నమస్కరిస్తే చాలు. నీకూ నీ విభూతికీ చేసినట్టే చెందినట్టే నీకు. అంటే ఏమని భావం. అంతా పరమాత్మే ననే భావన మనకు బలపడితే మనమేది చేసినా మనకు మనమే చేసుకొంటున్నా మనే సర్వాత్మ భావ మపరోక్షంగా అనుభవానికి రాగలదు.
Page 140