#


Back

   అదే జీవిత ధ్యేయం. పరమ పురుషార్థం. అంతకన్నా వాంఛించ దగినదిక ఏదీ లేదు మానవుడు. సమస్యలన్నీ అప్పుడిక సమసి పోవలసిందే. అదే సిద్ధి. ఇలాటి పురుషార్ధం సిద్ధించాలంటే ఏమిటి కర్తవ్యం. వినండి.

చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్యాజ సగోత్రః - యజుర్వేదీ - తైత్తిరీయ శాఖాధ్యాయీ - ఆపస్తంబ సూత్రః - శ్రీ నివాస శర్మా అహం భో అభివాదయే -

   అని ఇలా ఎవరికి వారు తమ ప్రవర చెప్పుకొని ఆ వాసుదేవ తత్త్వానికి అభివాదనం చేయాలి. వాసుదేవ అనేది పరిపూర్ణ చైతన్య స్వరూపం. పరిపూర్ణ శక్తి సమన్వితం. అదే మనకు జీవిత లక్ష్యం. కాని ఇప్పుడు మనమలా పరిపూర్ణులం కాము. అపరిపూర్ణ జ్ఞానమూ అపరిపూర్ణ శక్తే మనది. అది సమష్టి అయితే మనం వ్యష్టి. వ్యష్టిగా ఉన్నంత వరకూ సమస్యే. జనన మరణాలు తప్పవు. ఇహ పరాలకు రాకపోకలు తప్పవు. ఇవి తప్పించుకోవాలంటే వ్యష్టిగా ఉన్న మనం సమష్టిగా మారాలి. కొత్తగా మారటం కూడా కాదది. మనలో అంతర్గతంగా ఉన్న పరిపూర్ణతనే మరలా అను సంధానం చేసుకోవటమే.

Page 141