వ్యష్టి రూపంగా ఉన్నదా సమష్టి రూపమైన అహమే గాబట్టి మరలా ప్రత్యభిజ్ఞా బలంతో నేనా సమష్టి రూపమైన అహమేనని భావన చేయాలి మనం.
అందుకోసమా పరిపూర్ణమైన అహంభావానికి ఈ వ్యష్టి గతమైన
అహంకారాన్ని సమర్పిస్తున్నాము మనం అభివాదన వ్యాజంతో. మరి
ఎవడీ వ్యష్టి అంటే గుర్తు చేస్తున్నాడు. నేల నాలుగు చెరగులూ సముద్రమే
వ్యాపించి ఉంది. ఈ నేలమీదనే నివసిస్తున్నారు గో బ్రాహ్మణులు. అనగా
విద్యా విద్యావంతులూ. అవే జన్మ తారక మెప్పటికైనా. అవి రెండూ సుఖంగా
ఉంటే మిగతా అందరికీ సుఖం. కనుక వారికి శుభం కోరవలసి ఉంది
మొదట. తరువాత మన ప్రవర చెప్పుకోవాలి. ప్రవర అంటే మనమే
ఋషుల వంశంలో జన్మించామో ఆ ఋషుల గోత్ర సూత్రాలు. వారు
బ్రహ్మ విద్యా పారంగతులూ బ్రహ్మిష్ఠులూ గనుక మనకూ అదే
ప్రసాదిస్తారు. అందులో ఒక్కొక్క గోత్రాని కొక్కొక్కరుంటారు ఋషులు.
ఎవరిదే గోత్రమో అందులో ఎందరున్నారో ఋషులు వారి పేర్లు
స్మరించవలసి ఉంటుంది వారు. మాది ప్రస్తుతం భారద్వాజ గోత్రం.
భరద్వాజుడికి సగోత్రులం మేము. అంచేత నేను భారద్వాజ సగోత్రుణ్ణి.
మరి ఈ గోత్రాని కెందరు ఋషులు. ముగ్గురు. ఒకరు ఆంగిరసుడు.
Page 142