#


Index

   అంగిరుని కుమారుడు బృహస్పతి. ఆయన కుమారుడు బార్హస్పత్యుడు. రెండవ ఋషి. పోతే ఆయన కుమారుడు భరద్వాజుడు మూడవ వాడు. త్రయార్షేయ మీ గోత్రం. ముగ్గురు ఋషులున్న గోత్రమని అర్ధం.

   అంతేకాదు. ఋషుల గోత్రంలో జన్మిస్తే సరిపోదు. మనకా ఋషిత్వ మంటే దర్శనముందా అని ప్రశ్న. ఉందనిపించుకోవాలి. ఎలాగా. యజుర్వేదీ. ఒక వేదమైనా సాంగో పాంగంగా నేర్చుకొని ఉండాలి. తైత్తిరీయ శాఖాధ్యాయీ అందులోనూ తైత్తిరీయ మనే శాఖ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉండాలి. అంటే బ్రహ్మ జ్ఞాన మలవడి ఉండాలి. అలాగే దాన్ని వివరించి చెప్పే అపస్తంబ సూత్రాలు తెలిసి ఉండాలి. అందులో అధ్యాత్మ పటల మని ఉంది. అదంతా బ్రహ్మ విద్యే. ఆ శాఖా ఈ సూత్రమూ ఇంతవరకూ ఏదో యాంత్రికంగా వల్లె వేసి ఉండవచ్చు. అర్ధం లేని చదువు వ్యర్థమన్నారు. వ్యర్ధం కాదు ప్రతి పదార్థం కూడా గ్రహించానని నీవు చాటుకోవచ్చు. కాని వాటన్నిటికీ వివక్షితమైన ఏ బ్రహ్మ తత్త్వ మున్నదో అది పరోక్షంగా గాక అపరోక్షంగా గ్రహించ గలిగావా. లేదు. అందుకే అలాటి అనుభూతిని ప్రసాదించమని వంశ ఋషులకు అహం భో అభివాదయే అని నీ పేరూ ఊరూ చెప్పుకొని నమస్కరించాలి - ఆచార్యవాన్ పురుషో వేద అన్న దుపనిషత్తు - ఎంత శాస్త్రాధ్యయనం చేసినా శాస్త్ర జ్ఞానమే గాని ఆగమ జ్ఞానం Intutive Knowledge లేదు మనకు. అలాటి అపరోక్ష జ్ఞానం గురు ముఖంగానే లభించా లెప్పటికైనా.

Page 143