#


Index

   అది సూర్యమండలమూ దాని ప్రకాశము దాని వెలుగులో నడిచే మన జీవితమూ. ఎలాగూ తెలుస్తూనే ఉన్నది. తేజోబన్నా లిచ్చి మనలను కాపాడుతున్నదదే. ఇంతవరకూ మనకు తెలిసిందే. పోతే ఆధ్యాత్మికమైన భూమికలో చెబితే అది మనలను మేలు కొలిపే మన చేత అన్ని పనులు చేయిస్తూ మనకు మేలు చేసే మిత్రుడూ. అలాగే పగలంతా మనకు తన ప్రకాశాన్ని అందజేస్తూ మన స్థితిని కాపాడే సవిత. అలాగే సాయంకాలం తన ప్రకాశాన్ని తాను ఉపసంహరించు కొన్నా దాన్ని అగ్నిలో ప్రదీపాలలో ప్రవేశపెట్టి మన కుపకారం చేసి వరుణ రూపంలో మనల నావరించి నిద్ర పుచ్చి మనకు రాత్రి కాలం విశ్రాంతి కల్పించే వరుణుడు. మరలా తెల్లవారగానే నిద్ర నుంచి మనలను మేల్కొలిపి సుప్రభాతం చెప్పే ప్రాణమిత్రుడూ అవుతున్నాడు.

   పోతే ఇక పారమార్ధికంగా భావన చేస్తే ఎంతైనా ఉంది ఇందులో మర్మం. అది ఇంతకు ముందక్క డక్కడా స్పృశిస్తూనే వచ్చాను. దాన్నే కొంత విపులంగా వర్ణించి చెప్పాలని ఉంది. అసలదే తాత్పర్య మీ సంధ్యావందన ప్రక్రియ కంతా. సంధ్య అంటే ఏమని చెప్పాము. సంధ్యా అంటే గాయత్రే. గాయత్రి అంటే బ్రహ్మ విద్యే. అది బ్రహ్మాకార వృత్తే. అదే వరేణ్యం భర్గః - అలాంటి వృత్తి మానవుడి కేర్పడాలంటే బ్రహ్మ మనేదేదో తెలిస్తే గదా. దాన్నే ఇప్పుడీ మూడు మంత్రాలూ మనకు ప్రకటం చేస్తున్నాయి.

Page 106