రంగభూమి
అయితే ఎందుకింత గందరగోళ మేర్పడిందని అడుగుతారేమో. గందర గోళం కాదిది. మన వేదాంత గ్రంథాల విధానమే ఇది. ఉపనిషత్సం ప్రదాయాన్నే గీత కూడా అనుసరించింది. అందులో సాధకులకు అన్ని అంతస్తు లలో ఉండే వారికీ- అన్ని మాటలూ చెప్పవలసి ఉంది. వాటికి మరలా పరస్పర సంబంధం చూపవలసి ఉంటుంది. ఏది బోధించదలిస్తే దాన్ని ప్రశస్తమని వర్ణించవలసి ఉంటుంది. అన్నింటిలోనూ పరమ ప్రధానమైనది మరలా సూచించవలసి ఉంటుంది. మొత్తానికి దేనికది తెగగొట్టినట్టుగాక అన్ని జీవిత సత్యాలను కలిపి ఒక ముద్దగా చేసి అందించటమే భారతీయ తత్త్వశాస్త్ర సంప్ర దాయం.
ఈ రహస్యం తెలియకపోతే అంతా మనపాలిటికి గంగదరగోళంగానే కని పిస్తుంది. ఇదుగో ఇది నూటికి నూరుపాళ్ళూ గ్రహించిన మహానీయుడు జగ ద్గురు శంకర భగవత్పాదులొక్కరే. మిగతా వారంతా గీతనొక పుక్కిటి పురాణ మని భావిస్తే ఆయన దానినొక గొప్ప శాస్త్రంగా భావించారు. శాస్త్రీయమైన మార్గంలో వ్యాఖ్యానించారు. శాస్త్ర దృష్టినొక కరదీపికగా ధరించి పయనిస్తుంటే అల్లిబిల్లిగా అల్లుకొన్న ఆ లతా గుల్మ మార్గంలో ఆయనకు దారులు స్పష్టంగా అన్యోన్య విలక్షణంగా కనిపించాయి. ఏ శ్లోక మే ప్రకరణం Context లోనిదో - ఏ ప్రకరణమే అధ్యాయం లోనిదో ఏ అధ్యాయాని కే అధ్యాయాంతరం సంబంధించిందో మొత్తం శాస్త్రాని కాద్యంతాలేవో అసలు శాస్త్ర ప్రతి పాదితార్ధ మేమిటో - అత్యద్భుతంగా వివరించారాయన. ఒక విధంగా చెబితే పాణినీయా ష్టాధ్యాయిని భట్టోజీ దీక్షితులు సిద్ధాంత కౌముదిగా మలిచినట్టు మలచారాయన.
ఆ గురువుగారు చూపిన రహదారిలో పయనించిన వాడనే నేను. ఎక్కడ ఏ శ్లోకం తీసుకొన్నా - అటూ ఇటూ క్రమం మార్చినట్టు కనిపించినా నేనను కొన్న విషయం క్రమం ఏ మాత్రమూ మారబోదు. ఇది సాధక గీత కాబట్టి సాధకుల మార్గానికి పనికివచ్చే శ్లోకాలనే ఏరుకొన్నాను. తదనుగుణమైన వరుసలో పేర్చుకొన్నాను. శ్లోకశ్లోకానికీ సంబంధం కలుపుతూ ఒక శృంఖలా రూపంగా వివరిస్తూ వచ్చాను. తన్మూలంగా మాతృకలోని భావక్రమం తప్పదు సరికదా - దాని కింకా ఎంతో అనుకూలంగా కలిసి వస్తున్నది. ఇలా మైనం లాగా ఎటు తీస్తే అటుసాగి వస్తున్నదంటే అది భగవద్గీత సార్వపథీనమైన రచన. భాష్యకారుల అనన్యా దృశ్యమైన వ్యాఖ్యాన కౌశలం. ఈ రెండూ నేత్రాలుగా పనిచేస్తున్నంత దాకా నాకు దారితప్పే భయమేముంది. నాకూ లేదు - నాతో పాటు మీకూ లేదు. భగవద్గీత అంతా బంగారమే కాబట్టి ఎక్కడ ఎంత చేతికి తీసుకొని మనకు కావలసిన సొమ్ము లెలాంటివి చేసినా చేసుకోవచ్చు.
Page 5