#


Back

రంగభూమి


మొదటి దానికీ అను ష్టుప్పు ఛందస్సు. రెండవ దానికి త్రిష్టుప్పు. మూడవ దానికి జగతి. ఇందులో అనుష్టుప్పు కిరవయి నాలుగక్షరాలైతే- త్రిష్టుప్పుకు నలభయి నాలుగైతే జగతికి నలభయి ఎనిమిది. ఇవి బాల్యం ఇరవయి నాలుగు సంవత్సరాలకూ మధ్యకాలం నలభయి నాలుగింటికి- వార్డక్యం నలభయి ఎనిమిదింటికీ సంకేతాలుగా భావించమన్నారు. అప్పటికి మొత్తం మన ఆయుర్దాయం నూరుగాదు, నూట పదహారవుతుంది. ఈ నూట పదహారు వత్సరాలు మానవుడొక పవిత్రమైన యజ్ఞంగా భావించి ఉపాసిస్తే ఆయురారోగ్యాదులే గాక పరమపద ప్రాప్తికి కావలసిన ఉత్తమ జ్ఞానం కూడా లభిస్తుందట. అందుకే నేమో పెద్దలకు సమ్మానం చేసే టప్పుడు మనం నూట పదహార్లు సమర్పించటమనిపిస్తుంది. ప్రస్తుతం నూట పదహారు గీతా శ్లోకాల నెన్ను కోవటంలో నా ఉద్దేశం కూడా ఇదే. నూటపద హారు శ్లోకాలూ నూటపదహారు జీవితాబ్దాలకు సంకేతంగా భావించాను నేను. జీవేమ శరద శృత మన్నట్టు నూటపదహా రేండ్లు మనం బ్రతకాలని- బ్రతికిన బ్రతుకు మరలా వృధా కాకుండా ఒక్కొక్క శ్లోక మొక్కొక్క విలువైన జీవిత వర్షంగా భావించి అధ్యయనం చేయాలని - చేసి తరించాలనే నిగూఢమైన అభిసంధి Intention ఉంది నాకు. అందుకే ఈ సంఖ్యాను సరణం.

అయితే ఒక సందేహం రావచ్చు చాలా మందికి. గీతలో నుంచి మీరెన్ని శ్లోకాలైనా తీసుకోవచ్చు. ఎన్ని తీసుకొన్నా ఒక వరసలో తీసుకొనాలిగదా. వరస తప్పిస్తే మీకు ప్రతిపాద్యమైన విషయంలో క్రమమెలా సరిపోయింది. అని. వాస్తవమే. మూలంలో కచ్చితంగా అలాంటి క్రమం పాటించి ఉంటే సరిపోయేది కాదు. కాని అధ్యాయ విభాగం మినహా విషయ ప్రతిపాదనలో అంతకచ్చితమైన పరిపాటి Order లేదు మూలంలో కర్మ భక్తి యోగ జ్ఞానాదులన్నీ కలగా పులగం చేసి వ్రాసిన ఘట్టాలెన్నో ఉన్నాయి. ఒక విషయం వర్ణిస్తున్నప్పుడే విషయాంత "రాన్ని ప్రస్తావించటం కూడా జరిగింది. ఒక విషయమే మాటిమాటికీ చెప్పడం కూడా కద్దు. అసలు అధ్యాయ విభాగంలో కూడా అంతక్రమం కనిపించదు. సాంఖ్యం తరువాత కర్మా కర్మ తరువాత మరలా జ్ఞానమూ కర్మసన్న్యాసం తరువాత ఆత్మా సంయమమూ జ్ఞాన విజ్ఞానం తరువాత మరలా అక్షర పర బ్రహ్మమూ- ఇలా ఎంతో వ్యుత్ప్రమం కనిపిస్తుంది. పోతే సాంఖ్యం - జ్ఞానం విజ్ఞానం- పురుషోత్తమ- క్షేత్రజ్ఞ- ఇవన్నీ చెప్పే విషయ మొక్కటే. ఒక విధంగా పునరుక్తి ఇది.

Page 4