#


Back

రంగభూమి


ఇలాంటి సకలజన హితైషిణి అయినది భగవద్గీత. ఇంత శాస్త్రార్థ సంప్ర దాయాలతో కూడింది గనుకనే దాన్ని శాస్త్రంగానే మనం భావించాలని బోధి స్తారు శంకర భగవత్పాదులు. ఆయన అలాగే దర్శించి వ్యాఖ్యానించారు దాన్ని అది అతి లోకమైన అత్యద్భుతమైన వ్యాఖ్య. దాని వెలుగులో తీర్చిదిద్దినదే ప్రస్తుతమీ నా తెలుగు వ్యాఖ్య. దీనికి నేను సాధక గీత అని పేరు పెట్టడం కూడా సాభిప్రాయమే. వేదాంతంలో సాధన అనే దేమిటి అది ఎలా సాగించా లని ఎందరో అడుగుతుంటారు నన్ను. గీతలో ఉంది - చూచుకోండని సలహా ఇచ్చినా అది ఆ మహారణ్యంలో ఎక్కడ ఎలా ఉందో గుర్తించలేక తికమక పడు తుంటారు. అంచేత సాధన మార్గానికి సంబంధించిన శ్లోకాల నన్నింటినీ ఏర్చి ఒక వరుసలో చేర్చి వాటి అర్ధాన్ని వివరించి చెప్పటం మంచిదని తోచింది. నాకు అందుకోసమే ఈ కృషి.

ఇది ఇంతకు ముందే వ్రాసి ప్రకటించిన గ్రంథం. అప్పట్లో ఒక వంద శ్లోకాలు మాత్రమే తీసుకొని వివరణ వ్రాశాను. అది ఉండగా మరలా ఇది వ్రాయవలసిన అవసరం లేదు వాస్తవానికి. అయితే అందులో ఒక పెద్ద ఇబ్బంది ఏర్పడింది. ముద్రాపకుల అనవధానం వల్ల ఆ గ్రంథంలో ఎన్నో అచ్చు తప్పులు దొర్లాయి. ఒక్కొక్కచోట అక్షరాలూ - పదాలూ - వాక్యాలే ఎగిరి పోయాయి. అచ్చు కూడా అంత బాగాలేదు. ఒకటి రెండు చోట్ల కాగితాలే తిరగబడ్డాయి. దీనికితోడు శ్లోకాలకు క్రమ సంఖ్య ఇవ్వలేదు. మూలంలోని సంఖ్యాక్రమాన్నీ చూపలేదు. ఇన్ని అవకతవకలతో ఆ పుస్తక మొకరు చదవాలన్నా కష్ట మని పించింది. వారి కివ్వాలన్నా నాకు సిగ్గనిపించింది.

అంచేత ఇలాంటి కొరత తీర్చి మరలా దాని నున్నంతలో చక్కగా తీర్చిదిద్ది సాధక లోకాని కంద జేయాలనే సదుద్దేశంతో ప్రస్తుత మీ గ్రంథాన్ని నేను ప్రచురించ వలసి వచ్చింది. ఎలాగూ పునః ప్రయత్నం తప్పలేదు గదా అని ఆ నూటికి తోడు మరి ఒక పదహారు శ్లోకాల నేనిందులో చొప్పించి మొత్తం నూట పదహారుగా మీ కందిస్తున్నాను. నూట ఎనిమిదంటే ఒక అర్థముంది గాని - నూట పదహారేమిటని ప్రశ్న రావచ్చు. దాని కన్నా చాలా పెద్ద అర్థమే ఉంది ఇందులో. ఛాందోగ్యోపని షత్తులో ఒక మాట ఉంది, మానవుణ్ణి ఒక యజ్ఞంగా భావించి వాడి జీవితకాల మంతా మూడు సవనాలుగా విభజించా రట. మొదటిది ప్రాతస్సవనం. అది బాల్యం. రెండవది మాధ్యందిన సవనం. అది యౌవనం. మూడు సాయం సవనం. వార్ధక్యం. మూడింటికీ మామూలు యజ్ఞంలో మాదిరే మూడు ఛందోనియమాలున్నాయి.

Page 3