రంగభూమి
అనుభవమనేది ఎప్పుడూ ప్రత్యక్షమేగాని పరోక్షం గాదు. మిగతా ప్రాపంచిక పదార్థాల లాగా బ్రహ్మభావం కూడా మానవుడికి ప్రత్యక్షంగానే అనుభవానికి వస్తుందనీ అది సాధించే మార్గం కూడా అతి సులభమనీ- చాటించే ధైర్య మొక్కగీతకే చెల్లు. ప్రత్యక్షావ గమమ్ ధర్మ్యమ్ - సుసుఖమ్ కర్తు మవ్యయమ్" అని గీత ఇచ్చిన హామీ. ఇదే తదుపదేశ లక్ష్యం కూడా.
అయితే ఇది ఇంత బహిరంగ సత్యమై అందుకోట మింత సులభమైతే ప్రతివారి అనుభవానికీ రావాలిగదా ఎందుకు రావటంలేదని ప్రశ్న వస్తుంది. దానికి కారణం మానవ మనోదర్పణానికి పట్టిన మాలిన్యమే. కాబట్టి దానిని శుద్ది చేసుకోటానికి మొదట కర్మయోగమూ - శుద్ది అయిన తరువాత ఏకాగ్రత కోసం సమాధియోగమూ - ఆ తరువాత ఒక ఆలంబన కోసంగా భక్తియోగమూ అలవరచుకోవాలనీ -ఆ పిమ్మట వాటన్నిటి ఫలితంగా ఆత్మజ్ఞాన ముదయిస్తే అది చివరకు విజ్ఞానరూపమైన అనుభవంగా మారుతుందనీ - ఒక చక్కని భూమికాక్రమాన్ని నిర్దేశిస్తుంది గీత. దీనితో వరస్పరం విరుద్ధంగా కనిపించే సాధన మార్గాలన్నీ ఏకరూపంగా మారి అంతా బ్రహ్మాత్మానుభవంలో పర్యవ సానం చెందుతాయి. దీనిని బట్టి లోకంలో ఎవరి అంతస్తుకు తగినట్టు వారు తమ కనువైన మార్గాన్ని అనుసరిస్తూ పోవచ్చు. ఒక్కసారిగా అందరూ జ్ఞానాన్ని అందుకోలేరు. మానవులలో ఉత్తములుంటారు, మధ్యములుంటారు. మందు లుంటారు. అతి మందు లుంటారు. అందరినీ దృష్టిలో పెట్టుకొనే గీత అందరికీ అన్ని మార్గాలు బోధించింది. అవే కర్మ భక్తి సమాధి యోగాలు. భగవానుడే అంటాడొకచోట, మమ వర్క్ష్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరేది పట్టుకొని పోయినా మొత్తాని కందరూ నా మార్గంలో ఉన్నవారేనని చాటుతాడు. అయితే ఒక పెద్ద హెచ్చరిక ఏమంటే ఇవన్నీ సాధకుల సౌకర్యం కోసం చెప్పినవే గాని సాక్షాత్తుగా ప్రతి ఒక్కటి ఇందులో మోక్షపదవికి తీసుకు పోతుందని భ్రాంతి పడరాదు. సాక్షా న్మోక్ష ప్రదాయక మొక్క జ్ఞానమే. అది వెంటనే లభించక పోతే దానికివి పరంపరయా Indirect సాధనాలు. జ్ఞానముదయిస్తే ఇక వీటి కస్తిత్వం లేదు. సర్వమ్ కార్మఖిలమ్ పార్ధజ్ఞానే పరిసమాప్యతే, సర్వయోగాలూ జ్ఞాన యోగంలో పరిసమాప్తం కావలసిందే నంటుంది గీత.
Page 2