#


Back

ఆచరించ నక్కరలేదు. ఆచరించినా ఆచరించకపోయినా అవన్నీ ఇందులోనే వాడికి కలిసివస్తాయి. అంటే ఏమన్నమాట. జ్ఞానం కలిగే వరకూ ఏకర్మ అయినా చేయవలసిందే. జ్ఞానం గట్టి పడిందంటే ఇక అక్కడికి కర్మకాండ అంతా అగిపోవలసిందే. పోతే శారీరమైన కర్మ ఒక్కటే జరుగుతుంది. అదీ జ్ఞానాగ్నిచేత ఎప్పటికప్పుడు దగ్ధమవుతుందని వర్ణించారు. కాబట్టి ఏకర్మా లేదనే తాత్పర్యం.

87
బ్రహ్మార్పణమ్ బ్రహ్మ హవి-రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్
బ్రహ్మైవ తేన గంతవ్యమ్-బ్రహ్మ కర్మ సమాధినా    4-24

4-24

జ్ఞానమే యజ్ఞమని వర్ణించారు. అది ఎలా సంభవం. యజ్ఞమంటే బాహ్యంగా జరిగే కలాపం గదా అని ప్రశ్న వస్తుంది. వాస్తవమే. యజ్ఞ మంటే అదే అభిప్రాయం మనందరికీ. అయితే అవన్నీ ద్రవ్యయజ్ఞాలు. ద్రవ్యయజ్ఞాలలో ఒక అగ్ని హోత్రమనీ ఒకహవిస్సనీ ఒక ఆర్పణమనీ-దానితో హవిస్సును హోమం చేయట మనీ ఒక కర్మానుష్ఠాన మనీ- ఫలమనీ. ఇంత కలాప ముంటుంది. ఇదంతా మనకు భౌతికంగా బాహ్యంగా కనపడు తుంటుంది.

ప్రస్తుత మీ జ్ఞానాన్ని ఒక యజ్ఞమని పేర్కొన్నామంటే ఇవన్నీ దానిలో కూడా ఇలాగే ఉంటాయని గాదు. ఒక యజ్ఞం లాగా అది చాలా పవిత్ర మైనదని దాన్ని ప్రశంసించట మిది. తన్మూలంగా సాధకుడికి దాని మీద ఒక ప్రరోచన Inclination కలిగి దాన్ని అర్జించటానికి నడుము కడతాడు. అందుకోసమే దాన్ని యజ్ఞమని వర్ణించటం. అంతేగాని ప్రతి ఒక్క కర్మా బ్రహ్మాకారంగా దర్శిం చుమని చెబుతున్నప్పుడు యజ్ఞమని విశేషించి చెప్పటం దేనికి. అనావశ్యకం.

కొందరీరహస్యం గ్రహించలేక నిజంగానే ఇది ఒక యజ్ఞమని అర్థం చేసుకొని యజ్ఞాంగములుగా ప్రసిద్ధి చెందిన అగ్ని హోత్రహవిర్మంత్రాదుల నన్నింటినీ బ్రహ్మ దృష్టితో దర్శిస్తూ పోవాలని అదే జ్ఞాన యజ్ఞమని వ్యాఖ్యానిస్తు న్నారు. అది శుద్ధ తప్పని చాటారు భగవత్పాదులు. అగ్నిహోత్రాదులను బ్రహ్మ దృష్టితో చూచినా అవి ఎక్కడికీపోవు. అలాగే కనిపిస్తుంటాయి. మహా అయితే బ్రహ్మ దృష్టి ఉంటుంది మనకంత మాత్రమే. అలా చూడటం ఉపాసన అవుతుందేగాని జ్ఞానం కాదు.

Page 98