దానికి సంబంధించింది కానేరదు. చేస్తున్నట్టు కనిపించినా అది నిజంలో ఏ కర్మా చేయటం లేదు. ఒక ఘటాన్ని చేతితో పట్టుకు పోతుంటే దానిలోని ఖాళీ కూడా కదలి పోతున్నట్టు కనిపిస్తుంది. అంత మాత్రాన అది కదులు తున్నట్టా. అలాగే శరీరస్థమై కూడా అదేమీ చేయటం లేదు. చేయకనే పోతే ఇక ఆ కర్మ ఫలం మాత్రం దానినెలా అంటుతుంది. అదీ వట్టి మాటే. కాబట్టి పూర్ణ జ్ఞాని కర్మ చేస్తున్నా - శరీరంలో కనిపిస్తున్నా - వాడు ముక్తపురుషుడే.
86
శ్రేయాన్ ద్రవ్యమయా ద్యజ్ఞాత్- జ్ఞానయజ్ఞః పరంతప
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే 4-33
ఇలాంటి పరిశుద్ధమైన జ్ఞానదృష్టితో చేస్తేనే పసులు మనకంటకపోయేది. అలాకాక ఏమాత్రం సంకుచితమైన దృష్టితో చేసినా అవి మన మార్గానికి దోహదం చేయటమలా ఉంచి చెప్పరాని ద్రోహం చేస్తాయి.
అయితే అలౌకికమైన కర్మలైతే ద్రోహకరం కావచ్చుగాని శాస్త్రచోదితమైన యజ్ఞ యాగాదికర్మలలాంటి వెందు కవుతాయని సందేహించవచ్చు. ఇక్కడ శాస్త్రీయమూ లౌకికమనే తేడాలేదు. పరమార్ధంలో అన్నీ మాయామయమే. మాయికం కనుకనే అవి మానవుడికి ప్రేయస్సేగాని శ్రేయస్సుకావు. శ్రేయస్సనేది ఒకటే.
అది ఆత్మ జ్ఞానం.
జ్ఞానమే ఆమాటకువస్తే యథార్థమైన యజ్ఞం. మిగతావన్నీ భౌతికంగా జరిగేవి తదాభాసలే. వాస్తవంకావు. యజ్ఞమంటే యజనం లేదా భజనమని గదా అర్ధం చెప్పాము. సర్వత్రా సర్వదా ఉన్న పదార్థమేదో దానినే భజించాలి మానవుడు. అది ఒక్క ఆత్మ పదార్థమే. నశ్వరమైన ప్రపంచంకాదు. ఆపేక్షిక సత్యమై Relative truth స్వర్గాదులూకావు.
అంచేత మిగతా భౌతిక యజ్ఞాలజోలికి పోక సాధకుడైనవాడు జ్ఞానయజ్ఞమే ఒక మహాయజ్ఞంగా నిత్యమూ అనుష్ఠిస్తూ పోవాలి. ఇందులో ఏమాత్రమూ ద్రవ్యం వెచ్చించనక్కరలేదు. ఎలాంటి పశుహింసకూ ఆవకాశంలేదు. అసలు బాహ్యాని కెంత మాత్రమూ ప్రదర్శన కూడాలేదు. నిరంతరమూ మానసికంగా జరిగే మహాయజ్ఞమిది. ఇలాంటి యజ్ఞాన్ని ఆచరిస్తూపోయే సాధకు డేకర్మా
Page 97