#


Back

మంటలో పడి సమస్త కర్మలూ కట్టెల మాదిరి కాలిపోవలసిందే. అప్పుడిక కర్మ లేమిటి. వాణ్ణి బంధించటమేమిటి. కర్మ వాగురలోనుంచి అతి మెలకువతో తప్పించు కోగల మహానేర్పరి వాడు.

85
అనాదిత్వా న్నిర్గుణ త్వాత్-పరమాత్మాయ మవ్యయః
శరీర స్టోపి కౌంతేయ-నకరోతి నలిప్యతే    13-31

పూర్ణ జ్ఞాని కర్మ చేసినా చేయని వాడే-అది వాడి నేమాత్రమూ బంధించదని ప్రతిపాదించాము. అది ఒక వేళ విదేహ ముక్తుడి విషయంలోనైతే చెల్లుతుం దేమో గాని దేహంతో ఉండగానే ఎలా చెల్లుబడి అవుతుందని అడగ వచ్చు. ఎందుకంటే దేహ మున్నప్పుడు కర్మ చేయక తప్పదు. కర్మ చేశామంటే అది జడమైన దేహం గాదు చేయటం. చేతను డైన జీవుడు. అలాంటప్పుడు వాడి కది బంధక మెలకాదని ప్రశ్న రావటం సహజమే.

దీనికి సమాధానం చెబుతున్నాడు భగవానుడు. శరీరం కాదుకర్మ చేయటం, అంత వరకూ ఆక్షేపణ లేదు. కాని శరీరంలో కూచొని ఒక జీవుడు చేస్తున్నా డంటున్నారే అక్కడే మనం విచారణ చేయ వలసి ఉంది. జీవుడే చేస్తున్నాడని భావిస్తే వాడు బద్దుడే సందేహం లేదు. కాని జీవుడనే భావం నీవు కల్పించు కొన్నదే గాని వస్తుతః అలాంటి దెక్కడా లేదని మా సిద్దాంతం. చిదా భాసుడే జీవుడు. చైతన్యం మనః ప్రాణాది శరీరో పాధుల మేరకే ఉన్నట్టు భాసిస్తే ఆభాసకే జీవుడని మనం పేరు పెట్టాము. వాస్తవంలో శరీరం మేరకే లేదా చైతన్యం లోపలా వెలపలా సర్వత్రా ఉన్నది. స్వచ్ఛమైన అద్దంలో ప్రతి బింబం లాగా మానవుల మనోదర్పణంలో ప్రతిఫలించి కనిపిస్తున్నది.

ఇది ఏమిటా అని మరలా వివేచన చేసి చూస్తే సగుణంగా కనిపించే ఈ జీవుడు నిర్గుణమయిన ఆ చైతన్యమే. నిర్గుణం గనుకనే అవ్యయం. మార్పు లేనిది. మార్పు లేకుంటే దాని కాది కూడా లేదు. కనుకనే శరీరంలో ఒక జీవాత్మ రూపంగా కనిపిస్తున్నా వాస్తవాని కది పరమాత్మే. అంటే శరీరంతో సంబంధ ముండీ లేనిదే. ఘటంతో సంబంధ ముండీ లేనిదే గదా ఆకాశం. అలాగే ఈ చిదాకాశం కూడా.

ఎప్పుడైతే వాస్తవమైన సంసర్గం లేదో అప్పుడీ శరీర మనః ప్రాణాదులనే ఉపాధులతో ఏ పని జరుగుతున్నా అది ఆ ఉపాధుల మూలంగా జరిగే పనేగాని

Page 96