అలాగే సమాజంలోకూడా ఎవరి విధులు వారు నిర్వర్తించాలి. విద్యార్థి చదువు కొని బాగుపడాలి. ఉపాధ్యాయుడు చదువు నేర్పాలి. ఉద్యోగస్థులు వారి వారి ఉద్యోగ విషయాలు సక్రమంగా నెరవేర్చాలి. వ్యాపారస్థులు క్రయ విక్ర యాలు సరిగా నడుపుతుండాలి. మరి పరిపాలకు లన్నింటినీ పర్యవేక్షణ చేస్తూ పోవాలి. అందరూ కలిసి అన్ని పనులూ చేయటం సాంకర్యమైతే ఏపనీ చేయక పోవటం సోమరితన మవుతుంది. దానివల్ల తన జీవనమూ జరగదు. సమాజ జీవనమూ ముందుకు సాగదు. ఎవరికి తగినట్టు వారు వ్యక్తలందరూ కృషిచేస్తే సమష్టి రూపమైన మానవ సమాజం పురోగమిస్తుంది. అంతకంత కభ్యు దయాన్ని సాధిస్తుంది.
కాబట్టి పరధర్మం పైన వేసుకొని సంబాళించలేక చతికిల పడటం కన్నా స్వధర్మ మది ఎంత తక్కువ దనిపించినా మనకది విహితమని అనుసరించటమే హితం. విగుణమంటూ ఎలా ఆచరించటమని ప్రశ్నలేదు. విషంలో వుట్టిన క్రిమికి విషమెలా మారకం గాదో అలాగే విగుణమైనా అది వాడికి కీడుచేయదు. కారణమే మంటే అది లోకుల దృష్టిలో ఎంత నికృష్ణమైనా వాడి కాజన్మ సిద్దం. బ్రాహ్మజ్ఞాని అయి కూడా ధర్మవ్యాధుడు మాంస విక్రయం చేసినట్టు వర్ణించింది మహాభారతం. హింసాత్మకమైన కర్మ అయినా అది వాడికి కిల్బిషాన్ని అపాదించ లేదు. అది ఎలాగా అని శంకించరాదు. ఒక వైద్యుడు శస్త్ర చికిత్స చేస్తాడు. పురుషులకూ చేస్తాడు. స్త్రీలకూ చేస్తాడు. దానిని హింస అని గాని వ్యభిచార మని గాని ఆనలేవు గదా. అది వాడి వృత్తి ధర్మం. అలాగే ఇదీ అని అర్ధం చేసుకోవాలి. చేసుకొంటే ఇక గుణదోష విచారమంటూ ఉండబోదు.
73
యతఃప్రవృత్తి ర్భూతానామ్- యేన సర్వమితదమ్ తతమ్
స్వకర్మణా తమభ్యర్చ్య-సిద్దమ్ విందతి మానవః 8-46
ప్రతి ఒక్కరికీ కర్మలనేవి ప్రతి నియతం-వారవి ఆచరించి తీరాలని చెప్పారు. అలా ఆచరించటంలో కూడా ఊరక గ్రుడ్డి ఎద్దు చేలోబడ్డట్టు ఆచ రిస్తూ పోతే మరలా ప్రయోజనం లేదు. మహా అయితే ధార్మికమైన Religious ఫలిత ముంటుందేగాని వాటికి ఆధ్యాత్మికమైన Philosophical ఫలితముండ బోదు. మోక్ష పురుషార్థం సాధించటమే ఆధ్యాత్మిక ఫలం. అందు కోసమే భగ వానుడీ గీతోపదేశం చేసింది మనకు. సూటిగానో చాటుగానో దానికి దోహదం
Page 86