వర్గభేదమైనా ఉండి తీరుతుంది. ఇప్పుడీ వర్తమాన కాలంలో కూడా చూడండి. ఆచార్య వర్గమనీ priestsపాలక వర్గమనీ Administratorsవాణిజ్య వర్గమనీ Industrialists శ్రామిక వర్గ మనీ Labourers నాలుగు వర్గాల వారూ ప్రతి దేశంలో ప్రతి సమాజం లోనూ కనిపిస్తూనే ఉన్నారు గదా. శ్రామికుడు వ్యాపా రమూ చేయలేడు. వ్యాపారస్థుడు దేశ పాలనా చేయలేడు. పాలకుడు మతా చార్యుడు గానూ ఉండలేడు. ఎవడి స్వభావం వాడిదే. పుట్టుకతో వచ్చిందది. పుటం పెట్టినా మారదు.
అయితే అజ్ఞాన మున్నంత వరకూ అనేమాట మనం గుర్తుంచుకోవాలి. అంతా ఒకే ఒక ఆత్మ చైతన్య మనే సత్యాన్ని గుర్తించక పోవటమే గదా అజ్ఞానం తన్మూలంగా ఏర్పడిందే ఈ విభాగం. కాబట్టి ఇది వ్యావహారికమే Relative గాని పార మార్థికం Absoluteగాదు. పార మార్దిక దృష్టితో చూస్తే అంతా సమానమే.
పండితాస్సమ దర్శనః అయితే ఆ సమ దర్శన మలవడాలి ఇంతకూ. అది ఆత్మ జ్ఞానంతో గాని రాదు. ఆ జ్ఞాన మింకా ఉదయించ కుండానే అంతా ఏకమని చాటుతూ పోవటం ఆత్మ పంచన అవుతుంది. నూటికి తొంభయి తొమ్మిది మంది ఆత్మ జ్ఞానం లేనివారే. కాబట్టి ఈ వ్యవస్థ వ్యావహారికంగా ఇలా సాగుతూ పోవలసిందే తప్పదు.
72
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా త్స్వనుష్ఠితాత్
స్వభావ నియతమ్ కర్మ- కుర్వ న్నాప్నోతి కిల్బిషమ్ 18-47
లోకవ్యవస్థ ఇలా ఉండవలసింది గనుకనే ఎవడికి నియతమైన ధర్మంవాడు చేస్తూపోవటమే మంచిది. అది వాడి వ్యక్తి జీవితానికీ సమాజ జీవితానికీ రెండిం టికీ శ్రేయోదాయకం. అలాకాక ఒకరు చేయవలసిన దానిలో మరొకడు వేలు పెట్టాడంటే అది ఇద్దరికీ నష్టం. దానివల్ల సమాజ శ్రేయస్సు కూడా దెబ్బ తింటుంది.
ఒక ఇంట్లో తండ్రి తల్లి-కొడుకులూ కూతుళ్ళూ-అని ఉన్నారను కోండి. అందులో తండ్రి బయటికి పోయి సంపాదించి తెస్తే- తల్లి అన్నీ తయారుచేసి నలుగురికీ అమర్చితే-కొడుకులు చదువు సంధ్యలు నేరిస్తే కూతుళ్ళు తల్లికి తోడ్పడుతూ ఇల్లూ వాకిలీ చక్కబెడుతుంటే- గృహం బాగుపడుతుంది గాని ఒకరి పని ఒకరు చేస్తామని కూచుంటే ఎలా బాగుపడుతుంది.
Page 84