చేసి నప్పుడే దేనికి గానీ ఈ శాస్త్రంలో ప్రవేశం. అలా లేకపోతే దానికిక్కడ అవకాశమే లేదు.
ప్రస్తుత మాయా వర్ణాశ్రమాలకు విధించిన కర్మలు కూడా మానవుడి కలాంటి మోక్ష ఫలాన్ని ప్రసాదించాలంటే అవి ఏవో మనకు స్వధర్మమని కర్తవ్య బుద్ధితో ఆచరించటం వరకే అయితే సరిపోదు. ఆచరిస్తూ ఉన్న ప్రతికర్మా పరమేశ్వరార్పణ మస్తు అని తాత్త్వికమైన దృక్పథంతో ఆచరించాలి. అంటే ఈ కర్మ నేను గాదు చేయటం ఆ ఈశ్వరుడే నా హృదయంలో కూచొని చేయిస్తుంటే నేను చేస్తున్నాను దీని ఫలం కూడా నేను కోరటంలేదు- ఆ ఈశ్వరుడే దీనికి భోక్త-అని కర్తృత్వ భోక్తృత్వాలు వదలుకొంటూ చేయాలి దీనితో సంకుచితమైన వ్యష్టిభావన పోయి అతి విశాలమైన సమష్టి భావన అలవడుతుంది.
అసలు సమష్టి రూపుడే ఈశ్వరుడు కారణమే మంటే చరాచర జగత్తునూ సచ్చిద్రూపంగా వ్యాపించి ఉన్నదా ఈశ్వర తత్వమే. దానికి వ్యతిరిక్తంగా ఏదీ లేదు. అంతా దాని విభూతే. ఇందులో ఏది ఎక్కడ కదలినా మెదలినా దాని ప్రేరణ Impulsion వల్ల జరగవలసిందే. అంచేత ఇలాంటి సమష్టితత్త్వాన్ని భావిస్తూ పని చేస్తున్నప్పుడా వెలుగులోనే ఇవన్నీ జరుగుతున్నట్టు తోస్తుంది. అంతేకాదు. దాని పరిస్పంద విశేషాలే ఈ కర్మలన్నీ వీటికి కర్తృత్వం వహిస్తు న్నట్టు కనిపించే నేను కూడా ఆ వెలుగేననే భావ మేర్పడుతుంది మనకు. యధ్భావస్తద్భవతి అన్నారు ఏది భావన చేస్తే అదే అవుతాడు మానవుడు. క్రొత్తగా కావటం కూడా కాదిక్కడ. వాస్తవంలో మన మా ఈశ్వర స్వరూపులమే. వ్యష్టి భావనతో దానిని విస్మరించి జీవులమయ్యాయి. మరలా సమష్టి భావనతో చేస్తూపోతే దాని స్మృతి ఆవిర్భవించి ఈ వ్యష్టి రూపమైన అహంకారామూ Ego దీనితో చేసే కర్మ వ్యాపారమూ అంతా తద్రూపమే ననేజ్ఞాన ముదయి స్తుంది. ఈ జ్ఞానోదయమే నిజమైన సిద్ధి మన కర్మాచరణ కంతటికీ.
74
యజ్ఞార్థా త్కర్మణోన్యత్ర - లోకోయమ్ కర్మ బంధనః
తదర్ధ మపి కౌంతేయ - ముక్త సంగ స్సమాచర 3-9
అందుకే మనం చేసే ప్రతి కర్మా - యజ్ఞం కోసమే ననుకొంటూ చేయమని సలహా ఇస్తున్నాడు భగవానుడు. దేన్ని గురించి యజనం చేస్తామో అది యజ్ఞం.
Page 86