ఇది వాడి మనస్సులోనూ మాటలోనూ అయితే లాభంలేదు. మనసూ మాటా అనేది మనం చొచ్చి చూడలేము. ప్రవర్తనలో కనిపించాలి ప్రతిఒక్కటీ. ప్రవర్తన నెవ్వడూ కప్పివుచ్చలేడు. మరిదేనిలో బయట పడకపోయినా దానిలో తప్పకుండా బయటపడుతుంది. ఏదీ అలా ఎందరున్నారు సత్ప్రవర్తన కలవారు, స్వాముల వార్ల దగ్గర నుంచీ సామాన్యుల దాకా అందరూ దొంగలే. ఆత్మ వంచకులే. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఎగిరి గంతులు వేస్తారు. ఏ మాత్రం దానికి భిన్నంగా జరిగినా క్రుంగి కృశించి పోతారు.
ఇలాంటి పాటు పోటులు లేకుండా తాపీగా ఉండాలంటే జీవితం- అభిస్నేహ ముండరాదు దేనిలోనూ. అభిస్నేహ మంటే అభిమాన బుద్ధి ఇది నా సర్వస్వమనే తాదాత్మ్యభావం. అదే అనుకూల ప్రతికూలాలనే వైష్యమ్యానికి పునాది. మనస్సులొనే పెకలించ గలగాలి ఆ పునాదులను మనం. పెకలిస్తే ఇక మాటా చేతావాటి పాటికవే నిర్మలమవుతాయి. నిర్మలమూ నిబ్బరమూ అయిన ప్రవర్తన ఉన్న సాధకుడికి ఏది ఎలా జరిగినా ఒక్కటే. మంచి జరిగితే అభినందించడు. చెడ్డ జరిగితే నిందించడు. రెంటికీ అతీతంగా కనబడతాడు.
66
న కర్మణా మనారంభా - నైష్కర్మ్యం పురుషోశ్నుతే
నచ సన్న్య సనా దేవ - సిద్దిం సమధిగచ్ఛతి 3-4
అయితే ఒక అశంక. ఇంత అసిధారావ్రతం చేసేదానికన్న అసలీ కర్మల నేమీ అనుష్ఠించకుండా ఊరక కూచుంటే సరిపోలేదా. దానివల్ల మనకిక ఏబాధా లేదు గదా - అని అడగవచ్చు.
వాస్తవమే. ఏకర్మా ఆరంభించకపోతే మంచిదే. కానే అంత మాత్రాన అది నైష్కర్మ్య మనుకోరాదు. నైష్కర్మ్య మంటే ఏకర్మా లేకపోవటం. కర్మ అనేది ఏ ఒక్కటీ చేయకపోతే అది మనకు దక్కాలి వాస్తవంలో. కానీ దక్కదది. ఎందుచేత. కర్మ ఏదీ లేదంటే అది నిశ్చలమైన ఆత్మచైతన్యమే. ఆ చైతన్య మనుభవానికి రావాలంటే సత్త్వం బాగా శుద్ధిచెందాలి. అది శుద్ది కావాలంటే దానిని శోధించే కర్మను ఆచరించి తీరాలి. అప్పటికి కర్మాచరణమే నైష్కర్మ్యానికి ఉపాయ మయింది. మరి కర్మను ఆరంభించక పోతే అది ఎలా సిద్దిస్తుంది.
అందుచేత ఇంతకూ సాధకుడు పాటించవలసింది ఏమిటని ప్రశ్న, నైష్కర్మ్య రూపమైన ఆత్మ స్వరూపాన్ని గమ్యంగా భావించి దాన్ని చేరటానికి సాధనంగా
Page 78