లంటే దానికి సాధనచేసి తీరాలి. సాధన అంటే అదీ ఒక కర్మేగదా. మరికర్మ విడిచిపెడితే అది ఎలా సమకూరుతుంది మనకు.
కనుక కర్మ అనేది అసలు బొత్తిగా మానరాదు. చేస్తే అంతా నా కను కూలంగా జరగాలనీ చేయరాదు. కర్మఫలాన్ని ఈశ్వరుడికి ఒప్పజెప్పి కేవలం ఇది నాకు కర్తవ్యమనే తలంపుతో మాత్రమే చేయాలి. దీనికే నిష్కామ కర్మయోగ మనిపేరు. దీనివల్ల కర్తృత్వ భోక్తత్వాలనే రెండనర్థాలూ తొలగి పోతాయి సాధకు డికి. ఎలా గంటే నేనుకాదు చేయటం - ఈశ్వరశక్తి నా చేత చేయిస్తుందనే భావంతో కర్తృత్వం పోతుంది. దీనివల్ల ఏ ఫలిత ఏర్పడినా అది నాకు అక్కర లేదనే దృష్టితో భోక్తృత్వం నశిస్తుంది. ఇవి రెండూ రెండు కోరలు. కర్మమనే కాల సర్పానికి. అవి రెండూ నిష్కామమనే పట్టుకారుతో లాగివేస్తే అది ఒక స్వరూపంతో కనబడుతున్నా ఏమీ చేయలేదు.
65
య స్సర్వత్రా నభిస్నేహ-స్తత్త త్రావ్య శుభా శుభం
నా భినందతి నద్వేష్టి-తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా 2-57
కానీ ప్రతివాడూ డప్పాలు కొడుతుంటాడు- నేను నిష్కామ కర్మ చేస్తున్నాను-నాకు దేనిమీదా ఆసక్తి లేదని, పైకి చెప్పటం వేరు, యధార్థంగా ఉండటం వేరు. మానలవుందరికీ ఒక నైజం ఉన్నది. యథార్ధాన్ని మరుగుపరచి అయథా ర్థాన్నే లోకానికి ప్రదర్శించటం. ఇలాంటి ప్రదర్శనవల్ల అణుమాత్రంకూడా మనకు ప్రయోజనం లేదు. ప్రయోజనం లేకపోగా పెద్దమోసమిది. ఎక్కడయినా చెల్లుతుందేమో గాని ఆధ్యాత్మిక రంగంలో మోసమనేది ఏ మాత్రము చెల్లదు. మాటలలో ఎన్ని చెప్పినా చేతలలో తప్పకుండా బయటపడతాడు.
ఇంతెందుకు. నీవు నిష్కాముడ వైనందుకు ఒక్కటే గుర్తు. జీవిత మనేది ఒకే విధంగా గడవదెవ్వరికీ, కష్టాలువస్తుంటాయి. సుఖాలు వస్తుంటాయి అవీ ఎన్నో విధాలుగా ఎన్నో మోతాదులలో సంప్రాప్తిస్తుంటాయి. గుక్క తిప్పుకోవ టానికి వీలు లేని పరిస్థితులు ఏర్పడతాయి. గుండె పగిలి పోయే సంఘటనలే సంభవిస్తాయి. అలాగే ఆత్యుత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బులయ్యే ఆనందం కూడా కలుగుతుంది. ఇలాంటి సందర్భాలలోసాధకుడే మాత్రమూ క్రుంగిపోరాదు. పొంగిపోరాదు. వచ్చింది వచ్చినట్టుగా స్వీకరించాలి. అదే భగవంతుడిచ్చిన ప్రసాదంగా భావించాలి.
Page 77